UECF.NET

UECF Program July 14th, 2019 4:30 PM

Announcements

← All programs
Order of Worship

July 14th, 2019 Worship Service

Opening Prayer:
*Opening Hymn ‘ హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి ’ cover
Worship Songs in English & Telugu UECF Children & Youth
Special Song ‘దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము’ UECF Elderly Women
Worship Songs in English & Telugu UECF Choir
Special Song Evelyn Yeddu
Prayers of the People Pastor David Ravinder
Program Details

ఆరాధన క్రమము Rev. Devadanam Gummadi

బో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున.

సభ ఆమేన్.

బో: నీ వెలుగును, నీ సత్యమును బయలు దేర జేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును, నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠము నొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞాతా స్తుతులు చెల్లించెదను.

పాపపుటొప్పుదల

బో: ప్రభువు నందు ప్రియులారా! యదార్థ హృదయముతో మన తండ్రియైన దేవుని సమీపించి, ఆయన యెదుట మన పాపముల నొప్పుకొని, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయ చేయుమని వేడుకొందము.

బో: ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.

సభ: భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే.

బో: ప్రభువు సన్నిధిని నా యతిక్రమములు నేనొప్పుకొందు ననుకొంటిని.

సభ: నీవు నా పాప దోషము పరిహరించి యున్నావు.

బో: మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా! దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపులమనియు. అపవిత్రులమనియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితి మనియు నీ యెదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము.

ANNOUNCEMENTS

  • Thanks to Bro. Peter Samuel Gollapalli, Rev. Devadanam Gummadi, Dr. Rapaka John Bilmoria & Rev. Dr. David Ravinder for ministering to us today.
  • Next week, Pastor Israel Chokka will bring the Word of God.
  • Holy Communion will be administered on July 28th. Rev. Dr. David Ravinder will bring the Word.
  • UECF Annual Family Picnic will be held on Saturday, July 21st from 10:00 AM to 4:00PM at ROOSEVELT PARK(OPEN GROVE), Roosevelt Dr, Edison, NJ 08837. Please invite your family and friends for this event. Please feel free to sign-up the Fellowship Roster if you would like to bring any food item(s).
  • Evelyn Yeddu’s 14th Birthday Party follows the worship service.
  • Today’s Fellowship Hour is hosted by YEDDUs.
  • Please sign-up the Fellowship Roster if you would like to volunteer to host the Fellowship Coffee Hour.

July

7

ANAND VELLOREs

14

YEDDUs

21

28

Aug

4

11

18

25

Birthdays:

  • Mr. Chakravarthy Dova July 14th
    • Daniel Moodey July 15th
    • Christiana Peram July 17th
    • Mr. Joshua Vishalkumar July 21st
    • Mrs. Pavithra Charles July 21st

Visit us online at http://www.uecf.net  

హల్లెలూయ యేసు ప్రభున్

1. హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి

వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి

బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి

ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి

పల్లవి: రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్

హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి

2. తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి

పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి

బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి

నిరంతరము మారని యేసుని స్తుతియించుడి … రాజుల…

3. సూర్య చంద్రు లారఇల దేవుని స్తుతియించుడి

హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి

అగ్నివడ గండ్లారమీరు కర్తను స్తుతియించుడి

హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి … రాజుల…

4. యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి

జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి

పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి

ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి … రాజుల…

దేవుడే నాకాశ్రయంబు

పల్లవి: దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము

మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును

అభయ మభయ మభయ మెప్పు

డానంద మానంద మానంద మౌగ ||దేవుడే||

1. పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను

సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్ ||అభయ||

దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును

2. ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు ||అభయ||

రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన

3. పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును ||అభయ||

విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన

చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే ||అభయ||

Prayer Points:

  • The Spiritual growth/revival of UECF so that many people will be added and mightily used in HIS Vineyard. Also pray for the UECF upcoming events.
  • Pray for the President & Government of America, Prime Minister & Government of India and the other countries for God’s wisdom.
  • Please pray for Bro. Peter Samuel as he brings the Word of God today.
  • Please pray for Mr. Pradeep Dayala’s trip to India as he travel to India this week.
  • Please continue to pray for UECF’s own Church building.
  • Please pray for all the elderly for their good health.
  • Please pray for the people who are looking for new jobs.
  • Pray for the people who are looking for life partners and people who are longing for children.
  • Pray for those who are celebrating their Birthdays(Mr. Chakravarthy Dova, Daniel Moodey, Christiana Peram, Mr. Joshua Vishalkumar, Mrs. Pavithra Charles) that God may shower HIS blessings abundantly.
  • Please pray for the protection of minor girls as they go through sexual abuse worldwide.
  • Pray for Youth and Children to walk in the ways of the Lord.
  • God's servants and Missionaries who are working in HIS vineyard.
  • Please pray for the protection of new Christian converts from Muslim, Hindu and other religions.
  • Persecuted Christians in India and other nations.
  • The salvation of the perishing souls as we are in last days.
  • Revival and Purification of different Churches all over the world.

* సభ బోధకునితో కలిసి ఇట్లు చెప్పవలెను

మా కొరకు చనిపోవుటకై నీ జనితైక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవా! మమ్మును కనికరించి, ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయుము. మేము నీ కృపచేత నిత్యజీవము పొందునట్లు, నిన్ను గూర్చియు, నీ చిత్తమును గూర్చియు సరియైన ఙ్ఞానమును, నీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన వృధ్ధి పొందింపుమని, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.

బో: మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపొవుటకై తన యేక కుమారునిచ్చి, ఆయన మూలమున మన పాపములంటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారమిచ్చును. వారికి తన పరిశుధ్ధాత్మ ననుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును.

ఓ ప్రభువా! ఈ రక్షణను మా యందరికి దయచేయుము.

సభ: ఆమేన్

ప్రారంభ గీతము

యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు. నేనెవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణ దుర్గము ఎవరికి వెరతును? దుష్టులను నన్ను బాధించు శత్రువులను నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లిరి. నాతొ యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడడు.

త్య్రేకుని మహిమ

తండ్రికిన్, కుమారునికిన్, పరిశుద్ధాత్మకును ఆదియందు, ఇప్పుడు ఎల్లపుడు యుగయుగము లందునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్.

ప్రభుని కనికరము

బో: ప్రభువా! మమ్మును కనికరింపుము.

సభ: ప్రభువా! మమ్మును కనికరింపుము.

బో: క్రీస్తూ! మమ్మును కనికరింపుము.

సభ: క్రీస్తూ! మమ్మును కనికరింపుము.

బో: ప్రభువా! మమ్మును కనికరింపుము.

సభ: ప్రభువా! మమ్మును కనికరింపుము.

సర్వోన్నతుని మహిమ

బో: సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ. కలుగును గాక - దేవునికి మహిమ - కలుగును గాక = కలుగు నున్నతమైన - ఘన స్థలములందున - ఇలకు సమాధానం - నరుల కాయన దయ|| ప్రభువైన దేవా - పరమ రాజా - సర్వపరిపాలనా = పరిపూర్ణ శక్తిగల పరమజనక నిన్ను - మహిని స్తుతించుచు - మరి పొగడు చున్నాము ||

మహిమ పర్చుచు - ఆరాధించు చున్నాము నిన్ను = మహిమాతిశయమును - మది దలంచియు నీకు - మహిని మా స్తుతి కృతఙ్ఞత నిచ్చు చున్నాము. ||

*ఏక కుమారా - యేసు ప్రభువా - యెహొవా - తనయా - లోకపాపము మోయు - ఏక దేవుని గొఱ్ఱె - పిల్ల! మమ్మును కనిక - రించుము చల్లగ||

*లోకపాపములు - మోసుకుపోవు - యేసు రక్షకా = వాసిగ జనకుని కుడివైపున గూర్చుండు - యేసు ! మా ప్రార్థనా-లించి కనికరించు ||

పరిశుధ్ధుడవు - ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు = పరిశుద్ధాత్మతో తండ్రి - యైన దేవుని యందు - పరిపూర్ణ మహిమతో = ప్రబలు చున్నావెపుడు ||ఆమేన్||

బో: ప్రభువు మీతో నుండు గాక.

సభ: మీ అత్మతో నుండు గాక

బో: ప్రార్థింతము

సంగ్రహ ప్రార్థన

ఓ ప్రభువా, నీ సంఘము భక్తి సహితమైన నెమ్మది కలిగి, సంతోషముతో నిన్ను సేవించులాగున ఈ లోక చర్యలన్నిటిని నీ పరిపాలనతో సమాధానముగా జరుపుమని నీతోను, పరిశుద్ద్దాత్మతోను సదా ఏక దేవుడై యుగయుగములు జీవించుచు పరి పాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము.

సభ: ఆమేన్

పాత నిబంధన పాఠము – యిర్మీయా 29: 11-14

*పాత నిబంధన భాగము చదువుట ముగియగానే పాడ వలసినది

సభ: పరిశుద్ధుడవగు దేవా! పావన శక్తుడ దేవా ! పావన అమర్త్య దేవా ! మమ్మును కనికరింపుము.

పత్రిక పాఠము – రోమా 8: 22-28

బో: ఇంతటితో ఈ దినమునకైన పత్రిక పాఠము ముగియుచున్నది.

సభ: హల్లెలూయా ! హల్లెలూయా ! హల్లెలూయా!

సువార్త పాఠము – యోహాను 17: 1-19

సభ: ఓ ప్రభువా! నీకు మహిమ కలుగును గాక.

* సువార్త పాఠము చదివిన తరువాత

బో: ఇంతటితో ఈ దినమునకైన పరిశుద్ధ సువార్త పాఠము ముగియు చున్నది

సభ: ఓ క్రీస్తూ! నీకు స్త్రోత్రము కలుగును గాక.

ప్రియ నేస్తమా

ప్రియ నేస్తమా ఓ మధురమా - నా ప్రాణమా నా దైవమా (2X)

నువ్వుంటే చాలు నా జీవితానికి - నీ కృపయే చాలు నా జీవితాంతము (2X)

My Jesus I love you forever - My Jesus I love you forever (2X)

  1. యే క్షణమైనా యే ఘడియైనా - నీ స్నేహం నాతో ఉండాలయ్యా

నే నడిచే నడకలు నా త్రోవలన్నియు - నీ వెలుగు మార్గములై ఉండాలయ్యా ||2||

నా జీవితాంతము నీ కృపలోనే - నీ రెక్కల నీడలో (2X)

వొదిగి పోవాలి నా యేసయ్యా - ప్రియ నేస్తమా

My Jesus I love you forever - My Jesus I love you forever (2X)

  1. యేమున్నా లేకున్నా నిను స్తుతియించుటయే - నా జీవితానికి మహా భాగ్యము

నీలోని ఊహలు నాలోని ఆశలు – ఒకటి గానే ఉండాలయ్యా ||2||

నా ఊపిరి నా ప్రాణము - నీవై యున్నావయ్యా (2X)

నాలో వసియించు నా దైవమా - ప్రియ నేస్తమా

My Jesus I love you forever - My Jesus I love you forever (2X)

ప్రియ నేస్తమా ఓ మధురమా - నా ప్రాణమా నా దైవమా (2X)

నువ్వుంటే చాలు నా జీవితానికి - నీ కృపయే చాలు నా జీవితాంతము (2X)

Hallelujah Hallelujah Hallelujah - Hallelujah Hallelujah Hallelujah (2X)

కృపా, కృపా ఉన్నతమైనది

పల్లవి: కృపా, కృపా ఉన్నతమైనదీ

           కృపా, కృపా అత్యున్నతమైనదీ (2)

           శాశ్వతమైనది - పరిపూర్ణమైనది

           ఏసు ప్రభుని కృపా  (2)           ||కృపా||

1.        పర్వతములు తొలగిపోయిననూ

           మెట్టలూ దద్దరిల్లిననూ

           పర్వతములు తొలగిపోయిననూ

           మెట్టలూ దద్దరిల్లిననూ

           మారనిదీ - యెడబాయనిది

           నా ఏసుక్రీస్తు కృపా (2)         ||కృపా||

2.        శ్రమలు ఐనా, హింసలైననూ 

           కరువు ఐనా, ఖడ్గమైననూ 

           శ్రమలు ఐనా, హింసలైననూ 

           కరువు ఐనా, ఖడ్గమైననూ 

           ఇరుకు ఐనా - ఉపద్రవమైన

           వీడని క్రీస్తు కృపా (2)             ||కృపా||

అపోస్తులు విశ్వాస ప్రమాణము

భూమ్యకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రియైన దేవుని నేను నమ్ము చున్నాను. ఆయన ఏక కుమారుడగు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ము చున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యయైన మరియకు పుట్టి, పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వెయబడి చనిపోయి సమాధి వేయబడెననియు, అదృశ్యలోకములోనికి దిగెననియు, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమున కెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడిచేతి వైపున కూర్చుండి యున్నాడనియు సజీవులకును, మృతులకును, తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణము, శరీర పునరుత్ఢానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.

బో: మన తండ్రి యైన దేవుని నుండియు, ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగును గాక.

ప్రసంగము

బో: సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములను, మీ తలంపులకును కావలి యుండును గాక

సభ: ఆమేన్

Special Songs: Dr. Rapaka John Bilmoria

Introduction of Speaker: Bro. Simon Bushi Sermon: Bro. Peter Samuel Gollapalli

దేవా! నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము = నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము || నీసన్నిధానములోనుండి నన్ను త్రోసివేయకుము = నీ పరిశుద్దాత్మను నా యొద్దనుండి తీసివేయకుము || నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము = సమ్మతిగల మనసు కలుగజేసి నన్ను దృద్ధపరచుము ||

అర్పణలు Offertory

నీ కిచ్చు అర్పణలు - నీవే మా కిచ్చితివి = మా కున్న సకలాస్తుల్ - మా ప్రభువా యవి నీవి గదా - నీ కిచ్చు అర్పణలు - నీ విపుడు గైకొనుమా ||

*Closing Hymn: ‘Nearer, My God, to Thee’ UMH+528

6:55 PM *Closing Prayer & Benediction: Pastor David Ravinder

పంపుము దేవా - దీవెనలతో - పంపుము దేవా = పంపుము దయ చేత - పతిత పావన నామ - పెంపుగా నీ సేవ - ప్రియా మొప్ప నొనరింప - పంపుము దేవా - దీవెనలతో - పంపుము దేవా

Wonderful, merciful Savior

Precious Redeemer and Friend

Who would have thought that a Lamb

Could rescue the souls of men

Oh, You rescue the souls of men

Counselor, Comforter, Keeper

Spirit we long to embrace

You offer hope when our hearts have

Hopelessly lost our way

Oh, we've hopelessly lost the way

You are the One that we praise

You are the One we adore

You give the healing and grace

Our hearts always hunger for

Oh, our hearts always hunger for

Almighty, infinite Father

Faithfully loving Your own

Here in our weakness You find us

Falling before Your throne

Oh, we're falling before Your throne ..chorus ..

Light of the world, You stepped down into darkness
Opened my eyes, let me see
Beauty that made this heart adore You

Hope of a life spent with you

Hymn Lyrics


Chorus:
Here I am to worship Here I am to bow down
Here I am to say that You're my God
Altogether lovely Altogether worthy
Altogether wonderful to me

King of all days oh, so highly exalted
Glorious in heaven above
Humbly You came to the earth You created
All for Love's sake became poor

Chorus

I'll never know how much it cost
To see my sin upon that cross (2x)

Chorus

Lord, my heart can grow so far away and cold;

And yet for me Your love is still the same.

Lord, I bend my knee in awe and fear of Thee,

My head bowed down

In reverence to Your name.

I lift Your name, Your holy name,

Jehovah God, Elohim.

The Great I am, the Risen Lamb,

My Comforter and King.

Lord, my heart’s desire

Is to be filled with Spirit Fire,

My purpose is to worship You alone.

Open up my soul to worship and adore,

To be a fragrance offered to Your throne.

I lift Your name, Your holy name,

Jehovah God, Elohim.

The Great I am, the Risen Lamb,

My Comforter and King.