సాగి పోదును
పల్లవి: సాగి పోదును - గమ్యం చేరుదును
ఏసు నాతో ఉన్నందుకూ.. నడిపించుచున్నందుకూ.. (2)
హల్లెలూయ స్తుతీ స్త్రోత్రమూ.. ప్రభు ఏసుకె మహిమ స్త్రోత్రమూ.. (2)
సాగి పోదును - గమ్యం చేరుదును
ఏసు నాతో ఉన్నందుకూ.. నడిపించుచున్నందుకూ
1. పగలు మేఘస్థంభములో ఉండీ.. రాత్రి అగ్నిస్థంభములో ఉండీ.. (2)
ఇశ్రయెలీయులను కానాను దేశానికి నడిపించెనూ.. (2)
హల్లెలూయ స్తుతీ స్త్రోత్రమూ.. ప్రభు ఏసుకె మహిమ స్త్రోత్రమూ.. (2)
2. గాఢాంధకార లోయలైనా.. ఆగాథ జల మార్గమైనా.. (2)
నా ఏసు నాతో ఉన్నందునా.. నే భయపడనూ.. (2)
హల్లెలూయ స్తుతీ స్త్రోత్రమూ.. ప్రభు ఏసుకె మహిమ స్త్రోత్రమూ.. (2)
3. వ్యాధి బాధ ఇబ్బందులొచ్చినా.. కరువు నష్ట కష్టములూ వచ్చినా..
నా ఏసు నాతో ఉన్నందునా నే దిగులొందనూ.. (2)
సాగి పోదును.. గమ్యం చేరుదును
ఏసు నాతో ఉన్నందుకూ.. నడిపించుచున్నందుకూ.. (2)
హల్లెలూయ స్తుతీ స్త్రోత్రమూ.. ప్రభు ఏసుకె మహిమ స్త్రోత్రమూ.. (2)
ప్రభు ఏసుకె మహిమ స్త్రోత్రమూ
ప్రభు ఏసుకె మహిమ స్త్రోత్రమూ
ప్రభు ఏసుకె మహిమ స్త్రోత్రమూ