June 02nd, 2019 Worship Service
Brief Testimonies
Prayers of the People Pastor David Ravinder
ఆరాధన క్రమము Rev. Devadanam Gummadi
బో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున.
సభ ఆమేన్.
బో: నీ వెలుగును, నీ సత్యమును బయలు దేర జేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును, నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠము నొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞాతా స్తుతులు చెల్లించెదను.
పాపపుటొప్పుదల
బో: ప్రభువు నందు ప్రియులారా! యదార్థ హృదయముతో మన తండ్రియైన దేవుని సమీపించి, ఆయన యెదుట మన పాపముల నొప్పుకొని, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయ చేయుమని వేడుకొందము.
బో: ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.
సభ: భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే.
బో: ప్రభువు సన్నిధిని నా యతిక్రమములు నేనొప్పుకొందు ననుకొంటిని.
సభ: నీవు నా పాప దోషము పరిహరించి యున్నావు.
బో: మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా! దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపులమనియు. అపవిత్రులమనియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితి మనియు నీ యెదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై
ANNOUNCEMENTS
- Thanks to Bro. Praveen Pagadala & Rev. Dr. David Ravinder for ministering to us today.
- Next week, Rev. Joseph Theophilus will bring the Word of God.
- We are blocking some of the pews with ropes to encourage congregation to sit in the front pews. Your cooperation is highly appreciated.
- FUMC Westfield invited us to join their Pentecost Sunday Service on June 9th to present special music. Dress code is Indian traditional dress.
- UECF Annual Family Retreat will be held on June 15th from 9:00AM to 8:30PM at Harvey Cedars Bible Conference, 12 Cedars Ave, Harvey Cedars, NJ-08008.
- UECF Father’s Day Service will be held on June 16th. Please invite your family and friends for this special event.
- Ridhima Lauren Hariyala’s 2nd Birthday Party follows the worship service.
- Today’s Fellowship Hour is hosted by HARIYALAs.
- Please sign-up the Fellowship Roster if you would like to volunteer to host the Fellowship Coffee Hour.
June | 2 HARIYALAs | 9 SHAIKs | 16 UECF Women | 23 | 30 GUMMADIs |
July | 7 VELLOREs | 14 | 21 | 28 | -- |
Aug | 4 MUTHYALAs | 11 | 18 | 25 | -- |
Birthdays:
- Mrs. Sabita Ravinder 03rd June
- Mr. Ajay Damarapu 03rd June
- Mrs. Kalyani Mettegunta 06th June
- Ridhima Lauren Hariyala 08th June
- Mr. Sanjay Bhaskar 08th June
- Emmanuel Dhara 09th June
- Jason Moodey 09th June
- Mayah Shaik 09th June
Anniversaries:
- Mrs. Satya & Mr. David Aligya 10th June
Visit us online at http://www.uecf.net
Prayer Points:
- The Spiritual growth/revival of UECF so that many people will be added and mightily used in HIS Vineyard. Also pray for the UECF upcoming events.
- Pray for the President & Government of America, Prime Minister & Government of India and the other countries for God’s wisdom.
- Please pray for Bro. Praveen Pagadala as he brings the Word of God today.
- Please continue to pray for UECF’s own Church building.
- Please pray for all the elderly for their good health.
- Please pray for the people who are looking for new jobs.
- Pray for the people who are looking for life partners and people who are longing for children.
- Pray for those who are celebrating their Birthdays(Mrs. Sabita Ravinder, Mr. Ajay Damarapu, Mrs. Kalyani Mettegunta, Ridhima Lauren Hariyala, Mr. Sanjay Bhaskar, Emmanuel Dhara, Jason Moodey , Mayah Shaik) and Wedding Anniversary (Mrs. Satya & Mr. David Aligya) that God may shower HIS blessings abundantly.
- Please pray for the protection of minor girls as they go through sexual abuse worldwide.
- Pray for Youth and Children to walk in the ways of the Lord.
- God's servants and Missionaries who are working in HIS vineyard.
- Please pray for the protection of new Christian converts from Muslim, Hindu and other religions.
- Persecuted Christians in India and other nations.
- The salvation of the perishing souls as we are in last days.
- Revival and Purification of different Churches all over the world.
వచ్చుచున్నాము.
* సభ బోధకునితో కలిసి ఇట్లు చెప్పవలెను
మా కొరకు చనిపోవుటకై నీ జనితైక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవా! మమ్మును కనికరించి, ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయుము. మేము నీ కృపచేత నిత్యజీవము పొందునట్లు, నిన్ను గూర్చియు, నీ చిత్తమును గూర్చియు సరియైన ఙ్ఞానమును, నీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన వృధ్ధి పొందింపుమని, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
బో: మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపొవుటకై తన యేక కుమారునిచ్చి, ఆయన మూలమున మన పాపములంటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారమిచ్చును. వారికి తన పరిశుధ్ధాత్మ ననుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును.
ఓ ప్రభువా! ఈ రక్షణను మా యందరికి దయచేయుము.
సభ: ఆమేన్
ప్రారంభ గీతము
లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. నీతిమంతులారా, యెహోవానుబట్టి ఆనంద గానము చేయుడి! స్తుతి చేయుట యదార్థవంతులకు శోభస్కరము.
త్య్రేకుని మహిమ
తండ్రికిన్, కుమారునికిన్, పరిశుద్ధాత్మకును ఆదియందు, ఇప్పుడు ఎల్లపుడు యుగయుగము లందునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్.
ప్రభుని కనికరము
బో: ప్రభువా! మమ్మును కనికరింపుము.
సభ: ప్రభువా! మమ్మును కనికరింపుము.
బో: క్రీస్తూ! మమ్మును కనికరింపుము.
సభ: క్రీస్తూ! మమ్మును కనికరింపుము.
బో: ప్రభువా! మమ్మును కనికరింపుము.
సభ: ప్రభువా! మమ్మును కనికరింపుము.
సర్వోన్నతుని మహిమ
బో: సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ. కలుగును గాక - దేవునికి మహిమ - కలుగును గాక = కలుగు నున్నతమైన - ఘన స్థలములందున - ఇలకు సమాధానం - నరుల కాయన దయ|| ప్రభువైన దేవా - పరమ రాజా - సర్వపరిపాలనా = పరిపూర్ణ శక్తిగల పరమజనక నిన్ను - మహిని స్తుతించుచు - మరి పొగడు చున్నాము ||
మహిమ పర్చుచు - ఆరాధించు చున్నాము నిన్ను = మహిమాతిశయమును - మది దలంచియు నీకు - మహిని మా స్తుతి కృతఙ్ఞత నిచ్చు చున్నాము. ||
*ఏక కుమారా - యేసు ప్రభువా - యెహొవా - తనయా - లోకపాపము మోయు - ఏక దేవుని గొఱ్ఱె - పిల్ల! మమ్మును కనిక - రించుము చల్లగ||
*లోకపాపములు - మోసుకుపోవు - యేసు రక్షకా = వాసిగ జనకుని కుడివైపున గూర్చుండు - యేసు ! మా ప్రార్థనా-లించి కనికరించు ||
పరిశుధ్ధుడవు - ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు = పరిశుద్ధాత్మతో తండ్రి - యైన దేవుని యందు - పరిపూర్ణ మహిమతో = ప్రబలు చున్నావెపుడు ||ఆమేన్||
బో: ప్రభువు మీతో నుండు గాక.
సభ: మీ అత్మతో నుండు గాక
బో: ప్రార్థింతము
సంగ్రహ ప్రార్థన
సర్వశక్తిగల దేవా, నీ జనతైక కుమారుడగు మా ప్రభువైన యేసు క్రీస్తు పరలోకమునకు ఎక్కి పోయినని నమ్ము చున్నాము. ఆలాగుననే మేము మా హృదయములను, మనస్సులను పరలోకమునకెక్కించి నీతోను, పరిశుద్ద్దాత్మతోను సదా ఏక దేవుడై యుగయుగములు జీవించుచు పరి పాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము.
సభ: ఆమేన్
పాత నిబంధన పాఠము – యిర్మీయా 29: 11-14
*పాత నిబంధన భాగము చదువుట ముగియగానే పాడ వలసినది
సభ: పరిశుద్ధుడవగు దేవా! పావన శక్తుడ దేవా ! పావన అమర్త్య దేవా ! మమ్మును కనికరింపుము.
పత్రిక పాఠము – రోమా 8: 22-28
బో: ఇంతటితో ఈ దినమునకైన పత్రిక పాఠము ముగియుచున్నది.
సభ: హల్లెలూయా ! హల్లెలూయా ! హల్లెలూయా!
సువార్త పాఠము – యోహాను 17: 1-19
సభ: ఓ ప్రభువా! నీకు మహిమ కలుగును గాక.
* సువార్త పాఠము చదివిన తరువాత
బో: ఇంతటితో ఈ దినమునకైన పరిశుద్ధ సువార్త పాఠము ముగియు చున్నది
సభ: ఓ క్రీస్తూ! నీకు స్త్రోత్రము కలుగును గాక.
మంచి సాక్షిగ మార్చుము
పల్లవి: మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా
1. నాపై కనపరిచిన నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవం
నాపై కనపరిచిన నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవం
నలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవా
నలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా
2. నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి వాసునిగా
నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి వాసునిగా
నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా
నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
Wonderful, so wonderful
Is your unfailing love
Your cross has spoken mercy over me
No eye has seen no ear has heard
No heart could fully know
How glorious, how beautiful you are.
Beautiful one I love
Beautiful one I adore
Beautiful one my soul my strength
Powerful so powerful
Your glory fills the skies
Your mighty works displayed for all to see
The beauty of your majesty
Awakes my heart to see
How marvelous how wonderful you are.
Beautiful one I love
Beautiful one I adore
Beautiful one my soul my strength
ఒకసారి ఆలోచించవా (Dm)
పల్లవి: ఒకసారి ఆలోచించవా.. ఓ సోదరా
ఒకసారి అవలోకించవా.. ఓ సోదరీ (2X)
నీ జీవిత మూలమేదో - నీ బ్రతుకు ఆధారమేదో (2X)
… ఒకసారి…
1. తండ్రి యెహోవా తన్ను పోలి - నిను చేసెను తన వూపిరిలో (2X)
నా వలెనే నీవు పరిశుద్దముగ - జీవించమని కోరెను .
. ..నీ జీవిత…
2. దేవుని వదలి దుష్టుని కూడి - లోకము తట్టు మరలి (2X)
లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలొ అణగారితివా
...నీ జీవిత …
3. లోకము వీడు యేసయ్యన్ చూడు - నిత్య జీవముకై పరుగిడు (2X)
నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా
...నీ జీవిత …
అపోస్తులు విశ్వాస ప్రమాణము
భూమ్యకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రియైన దేవుని నేను నమ్ము చున్నాను. ఆయన ఏక కుమారుడగు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ము చున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యయైన మరియకు పుట్టి, పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వెయబడి చనిపోయి సమాధి వేయబడెననియు, అదృశ్యలోకములోనికి దిగెననియు, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమున కెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడిచేతి వైపున కూర్చుండి యున్నాడనియు సజీవులకును, మృతులకును, తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణము, శరీర పునరుత్ఢానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.
బో: మన తండ్రి యైన దేవుని నుండియు, ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగును గాక.
ప్రసంగము
బో: సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములను, మీ తలంపులకును కావలి యుండును గాక
సభ: ఆమేన్
Special Songs: Degapogu family
Sermon: Bro. Praveen Pagadala
దేవా! నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము = నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము || నీసన్నిధానములోనుండి నన్ను త్రోసివేయకుము = నీ పరిశుద్దాత్మను నా యొద్దనుండి తీసివేయకుము || నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము = సమ్మతిగల మనసు కలుగజేసి నన్ను దృద్ధపరచుము ||
అర్పణలు Offertory
నీ కిచ్చు అర్పణలు - నీవే మా కిచ్చితివి = మా కున్న సకలాస్తుల్ - మా ప్రభువా యవి నీవి గదా - నీ కిచ్చు అర్పణలు - నీ విపుడు గైకొనుమా ||
6:55 PM *Closing Prayer & Benediction: Pastor David Ravinder
పంపుము దేవా - దీవెనలతో - పంపుము దేవా = పంపుము దయ చేత - పతిత పావన నామ - పెంపుగా నీ సేవ - ప్రియా మొప్ప నొనరింప - పంపుము దేవా - దీవెనలతో - పంపుము దేవా
Visit us online at http://www.uecf.net
దేవుని వారసులం
పల్లవి: దేవుని వారసులం - ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం - యేసుని దాసులము
నవ యుగ సైనికులం - పరలోక పౌరులము
హల్లెలూయ - నవ యుగ సైనికులం - పరలోక పౌరులము
1. దారుణ హింస లలో - దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో - ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో - సర్వత్ర యేసుని కీర్తింతుము
2. పరిశుద్దాత్మునికై - ప్రార్థన సలుపుదము
పరమాత్ముని రాక - బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై - సర్వాంగ హోమము జేయుదము
3. అనుదిన కూటములు - అందరి గృహములలో
ఆనందముతోను - ఆరాధనలాయే
వీనుల వినదగు పాటలతో - ధ్యానము చేయుచు మరియుదము
Open the eyes of my heart Lord
Open the eyes of my heart
I want to see You
I want to see You
Open the eyes of my heart, Lord
Open the eyes of my heart
I want to see You
I want to see You
To see You high and lifted up
Shinin' in the light of Your glory
Pour out Your power and love
As we sing holy, holy, holy
Holy, Holy, Holy, you are Holy, Holy Holy
Holy, Holy, Holy I want to see you
Draw me close to You
Never let me go
I lay it all down again
To hear You say that I`m Your friend
You are my desire No one else will do
`Cause nothing else could take Your place
To feel the warmth of Your embrace
Help me find the way
Bring me back to You
You`re all I want
You`re all I`ve ever needed
You`re all I want
Help me know You are near
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
పల్లవి: దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది
1. యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి||
2. గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి||
3. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును
వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి||
4. ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి||