Apr 07th, 2019 Worship Service
Brief Testimonies
ఆరాధన క్రమము
బో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున.
సభ ఆమేన్.
బో: నీ వెలుగును, నీ సత్యమును బయలు దేర జేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును, నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠము నొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞాతా స్తుతులు చెల్లించెదను.
పాపపుటొప్పుదల
బో: ప్రభువు నందు ప్రియులారా! యదార్థ హృదయముతో మన తండ్రియైన దేవుని సమీపించి, ఆయన యెదుట మన పాపముల నొప్పుకొని, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయ చేయుమని వేడుకొందము.
బో: ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.
సభ: భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే.
బో: ప్రభువు సన్నిధిని నా యతిక్రమములు నేనొప్పుకొందు ననుకొంటిని.
సభ: నీవు నా పాప దోషము పరిహరించి యున్నావు.
బో: మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా! దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపులమనియు. అపవిత్రులమనియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితి మనియు నీ యెదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము.
* సభ బోధకునితో కలిసి ఇట్లు చెప్పవలెను
మా కొరకు చనిపోవుటకై నీ జనితైక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవా! మమ్మును కనికరించి, ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయుము. మేము నీ కృపచేత నిత్యజీవము పొందునట్లు, నిన్ను గూర్చియు, నీ చిత్తమును గూర్చియు సరియైన ఙ్ఞానమును, నీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన వృధ్ధి పొందింపుమని, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
బో: మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపొవుటకై తన యేక కుమారునిచ్చి, ఆయన మూలమున మన పాపములంటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారమిచ్చును. వారికి తన పరిశుధ్ధాత్మ ననుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును.
ఓ ప్రభువా! ఈ రక్షణను మా యందరికి దయచేయుము.
సభ: ఆమేన్
ప్రారంభ గీతము
త్య్రేకుని మహిమ
తండ్రికిన్, కుమారునికిన్, పరిశుద్ధాత్మకును ఆదియందు, ఇప్పుడు ఎల్లపుడు యుగయుగము లందునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్.
ప్రభుని కనికరము
బో: ప్రభువా! మమ్మును కనికరింపుము.
సభ: ప్రభువా! మమ్మును కనికరింపుము.
బో: క్రీస్తూ! మమ్మును కనికరింపుము.
సభ: క్రీస్తూ! మమ్మును కనికరింపుము.
బో: ప్రభువా! మమ్మును కనికరింపుము.
సభ: ప్రభువా! మమ్మును కనికరింపుము.
సర్వోన్నతుని మహిమ
బో: సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ. కలుగును గాక - దేవునికి మహిమ - కలుగును గాక = కలుగు నున్నతమైన - ఘన స్థలములందున - ఇలకు సమాధానం - నరుల కాయన దయ|| ప్రభువైన దేవా - పరమ రాజా - సర్వపరిపాలనా = పరిపూర్ణ శక్తిగల పరమజనక నిన్ను - మహిని స్తుతించుచు - మరి పొగడు చున్నాము ||
మహిమ పర్చుచు - ఆరాధించు చున్నాము నిన్ను = మహిమాతిశయమును - మది దలంచియు నీకు - మహిని మా స్తుతి కృతఙ్ఞత నిచ్చు చున్నాము. ||
*ఏక కుమారా - యేసు ప్రభువా - యెహొవా - తనయా - లోకపాపము మోయు - ఏక దేవుని గొఱ్ఱె - పిల్ల! మమ్మును కనిక - రించుము చల్లగ||
*లోకపాపములు - మోసుకుపోవు - యేసు రక్షకా = వాసిగ జనకుని కుడివైపున గూర్చుండు - యేసు ! మా ప్రార్థనా-లించి కనికరించు ||
పరిశుధ్ధుడవు - ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు = పరిశుద్ధాత్మతో తండ్రి - యైన దేవుని యందు - పరిపూర్ణ మహిమతో = ప్రబలు చున్నావెపుడు ||ఆమేన్||
బో: ప్రభువు మీతో నుండు గాక.
సభ: మీ అత్మతో నుండు గాక
బో: ప్రార్థింతము
సంగ్రహ ప్రార్థన
సభ: ఆమేన్
పాత నిబంధన పాఠము – యిర్మీయా 9: 23-24
*పాత నిబంధన భాగము చదువుట ముగియగానే పాడ వలసినది
సభ: పరిశుద్ధుడవగు దేవా! పావన శక్తుడ దేవా ! పావన అమర్త్య దేవా ! మమ్మును కనికరింపుము.
పత్రిక పాఠము – ఫిలిప్పి 1:27 – 2:4
బో: ..... రోజుకు ఏర్పరుపబడిన పత్రిక వాక్యభాగము ...... వ్రాసిన పత్రిక ....... వ అధ్యాయము ...... వ వచనము నుండి ఈలాగు వ్రాయబడియున్నది.
బో: ఇంతటితో ఈ దినమునకైన పత్రిక పాఠము ముగియుచున్నది.
సభ: హల్లెలూయా ! హల్లెలూయా ! హల్లెలూయా!
* ప్రభుని శ్రమ కాలములో ఈ క్రింది వచనము పాడవలెను
సభ: నిందితుడై క్రీస్తు మరణ మొందునంతగా, శ్రమ నొందునంతగా, సిల్వ నొందునంతగా, ఇంపొందుగా తగ్గించుకొనియె నొనర వినయుడై
సువార్త పాఠము – లూకా 18: 9-14
బో: .....కు ఏర్పరుపబడిన పరిశుద్ధ సువార్త వాక్యభాగము పరిశుద్ధుడైన ..... వ్రాసిన సువార్త ..... వ అధ్యాయము ..... వ వచనము నుండి ఈలాగు వ్రాయబడి యున్నది.
సభ: ఓ ప్రభువా! నీకు మహిమ కలుగును గాక.
* సువార్త పాఠము చదివిన తరువాత
బో: ఇంతటితో ఈ దినమునకైన పరిశుద్ధ సువార్త పాఠము ముగియు చున్నది
సభ: ఓ క్రీస్తూ! నీకు స్త్రోత్రము కలుగును గాక.
అపోస్తులు విశ్వాస ప్రమాణము
భూమ్యకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రియైన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడగు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ము చున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యయైన మరియకు పుట్టి, పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వెయబడి చనిపోయి సమాధి వేయబడెననియు, అదృశ్యలోకములోనికి దిగెననియు, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమున కెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడిచేతి వైపున కూర్చుండి యున్నాడనియు సజీవులకును, మృతులకును, తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణము, శరీర పునరుత్ఢానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.
ప్రసంగము
బో: మన తండ్రి యైన దేవుని నుండియు, ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగును గాక.
బో: సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములను, మీ తలంపులకును కావలి యుండును గాక
సభ: ఆమేన్
Sermon: ‘ప్రభువునందు అతిశయించుట’ Rev. Devadanam Gummadi
అర్పణలు Offertory
నీ కిచ్చు అర్పణలు - నీవే మా కిచ్చితివి = మా కున్న సకలాస్తుల్ - మా ప్రభువా యవి నీవి గదా - నీ కిచ్చు అర్పణలు - నీ విపుడు గైకొనుమా ||
6:55 PM *Closing Prayer & Benediction: Rev. Devadanam Gummadi
పంపుము దేవా - దీవెనలతో - పంపుము దేవా = పంపుము దయ చేత - పతిత పావన నామ - పెంపుగా నీ సేవ - ప్రియా మొప్ప నొనరింప - పంపుము దేవా - దీవెనలతో - పంపుము దేవా
Visit us online at http://www.uecf.net
ANNOUNCEMENTS
- Thanks to Rev. Devadanam Gummadi for ministering to us today.
- Next week, Rev. Joseph Theophilus will bring the Word of God.
- UECF Good Friday Service will be held on April 19th from 11:30AM to 2:30PM. Dr. Sundara Rao Tsappidi, Pastor Raj Punuru, Rev. Dr. David Ravinder, Bro. Sunil Robert Vuppula, Rev. Joseph Theophilus, Bro. Praveen Charles and Bro. Josiah Srigiri will share the 7 Words spoken by Jesus on the Cross.
- UECF Easter Sunrise Service will be held on April 21st at 6:30AM. Rev. Dr. David Ravinder will bring the Easter message. There will be no Evening service on Easter. Please invite your family and friends for these special services. Egg Hunt for Children follows the Easter worship service.
- Lenten Cottage Prayer meetings(Theme: A Clash of Kingdoms by Ray Vander Laan; Preacher: Pastor Ravinder) schedule for this year (Address: FUMC Fellowship Hall/Social Hall):
Date | Hosts | Quiz |
08 - Mar - 2019 | PILLIs | Philippi |
15 - Mar - 2019 | MYLAs | Philippians Chapter 1 |
22 - Mar - 2019 | BHASKARs | Philippians Chapter 2 |
29 - Mar - 2019 | MAREs | Philippians Chapter 3 |
05 - Apr - 2019 | SHAIKs | Philippians Chapter 4 |
12 - Apr - 2019 | DEVIs | Acts Chapter 17 |
- Today’s Fellowship Hour is hosted by UECF.
- Please sign-up the Fellowship Roster if you would like to volunteer to host the Fellowship Coffee Hour.
Apr | 7 UECF | 14 BANDIs | 19 UECF Families | 21 | 28 RAVINDERs |
May | 5 | 12 UECF men | 19 | 26 | -- |
Birthdays:
- Mrs. Evelyn Reid 09th April
- Mrs. Sarita Ravinder 10th April
- Mr. Samuel Prabhakar Raya 12th April
- Ms. Priscilla Chilaka 13th April
Anniversaries:
- Mrs. Sanjotha & Mr. Samuel Rapaka 08th April
- Mrs. Anju & Mr. Sunil Mentay 10th April
- Mrs. Persis & Mr. Christopher Bandari 11th April
- Mrs. Vineela & Mr. Ravindra Punuru 11th April
- Mrs. Asha & Mr. Chakravarthy Dova 12th April
Visit us online at http://www.uecf.net
- The Spiritual growth/revival of UECF so that many people will be added and mightily used in HIS Vineyard. Also pray for the UECF upcoming events.
- Pray for the President & Government of America, Prime Minister & Government of India and the other countries for God’s wisdom.
- Please pray for Rev. Devadanam Gummadi as he brings the Word of God today.
- Please continue to pray for UECF’s own Church building.
- Please pray for all the elderly people for their good health.
- Please pray for the people who are looking for new jobs.
- Pray for the people who are looking for life partners and people who are longing for children.
- Pray for those who are celebrating their Birthdays(Mrs. Evelyn Reid, Mrs. Sarita Ravinder, Mr. Samuel Prabhakar Raya, Ms. Priscilla Chilaka) and Wedding Anniversaries (Mrs. Sanjotha & Mr. Samuel Rapaka, Mrs. Anju & Mr. Sunil Mentay, Mrs. Persis & Mr. Christopher Bandari, Mrs. Vineela & Mr. Ravindra Punuru, Mrs. Asha & Mr. Chakravarthy Dova) that God may shower HIS blessings abundantly.
- Please pray for the protection of minor girls as they go through sexual abuse worldwide.
- Pray for Youth and Children to walk in the ways of the Lord.
- God's servants and Missionaries who are working in HIS vineyard.
- Please pray for the protection of new Christian converts from Muslim, Hindu and other religions.
- Persecuted Christians in India and other nations.
- The salvation of the perishing souls as we are in last days.
- Revival and Purification of different Churches all over the world.
అపరాధిని యేసయ్య
పల్లవి: అపరాధిని యేసయ్య - క్రపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ క్రపలో - నపరాధములను క్షమించు ..అపరాధిని..
1. సిలువకు నినునే గొట్టితీ - తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా ..అపరాధిని..
2. ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితి వయ్యో ..అపరాధిని..
3. ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ ..అపరాధిని..
4. దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావినిడితి
ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను ..అపరాధిని..
5. ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్క్రూరుండనై గొట్టితిని - ఘోరంపి పాపిని దేవా ..అపరాధిని..
"Amazing Grace (My Chains Are Gone)" – YOUTH SONG
Amazing grace
How sweet the sound
That saved a wretch like me
I once was lost, but now I'm found
Was blind, but now I see
'Twas grace that taught my heart to fear
And grace my fears relieved
How precious did that grace appear
The hour I first believed
My chains are gone
I've been set free
My God, my Savior has ransomed me
And like a flood His mercy reigns
Unending love, amazing grace
The Lord has promised good to me
His word my hope secures
His word my hope secures
He will my shield and portion be
As long as life endures
[2x]
My chains are gone
I've been set free
My God, my Savior has ransomed me
And like a flood His mercy reigns
Unending love, amazing grace
The earth shall soon dissolve like snow
The sun forbear to shine
But God, Who called me here below,
Will be forever mine.
Will be forever mine.
You are forever mine.
అత్యున్నత సింహాసనముపై – CHILDREN SONG
పల్లవి: అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతుము నిన్నే
ఆహాహా ... హల్లేలూయ (4X)
ఆహాహా ... హల్లేలూయ (3X) ...ఆమెన్
1. ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం
…ఆహాహా…
2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణకర్తా స్తోత్రం
…ఆహాహా…
3. ఆమేన్ అనువాడా స్తోత్రం - ఆల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం
…ఆహాహా…
Above all powers, above all kings
Above all nature and all created things
Above all wisdom, and all the ways of man
You were there before the world began
Above all kingdoms, above all thrones
Above all wonders the world has ever known
Above all wealth and treasures of the earth
There's no way to measure what you're worth
Crucified, laid behind the stone
You lived to die, rejected and alone
Like a rose, trampled on the ground
You took the fall And thought of me, above all
ఆశ్చర్యమైన ప్రేమ
పల్లవి: ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది - నన్ను జయించె నీ ప్రేమ
1. పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి, నిత్య జీవమిచ్చె
…ఆశ్చర్యమైన ప్రేమ…
2. పావన యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ నిచ్చే
…ఆశ్చర్యమైన ప్రేమ…
3. శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని, ప్రేమది, ఎన్నడు, యెడబాయదు
…ఆశ్చర్యమైన ప్రేమ…
4. నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి, కౌగలించి, ముద్దాడి, కన్నీటిని తుడిచే
…ఆశ్చర్యమైన ప్రేమ…
ఓ యేసు నీ దివ్య ప్రేమ
పల్లవి: ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా
విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ (2X)
1. సిలువే శరణం ప్రతి జీవికి విలువే లేని మనుజాళికి (2X)
కలుషము బాపిన యేసయ్యకి
అలుపెరుగక ప్రార్ధన చేయుదము || ఓ యేసు||
2. తరతరములలో నీ నామము వరముల నొసగిన పై నామను (2X)
అరయగ అరుదెంచావయ్య
మొరలిడుదును మదిలో నేనయ్య || ఓ యేసు||