#633
ఈ జీవిత ఈత
పల్లవి · Pallavi
ఈ జీవిత ఈత – ఈదలేకున్నాను నా చేయి పట్టుకో నా యేసు నాథా ||ఈ జీవిత||
అనుపల్లవి · Anupallavi
గాలి తుఫానులకు గెలిగే తరంగముల ||ఈ జీవిత||
చరణము 1
కొట్టబడుచున్నాను గదా నా దేవా సారహీనమగు సంసారాబ్ధిలోన సాగలేకున్నాను సాయంబురావా – సారాకరుణారససుధారలే నా కొసగుము సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము ||ఈ జీవిత||
చరణము 2
సంఘ సంబంధముగా శాంతి లేకపోయె – సమానత్వత్వంబు సమసిపోయె – సోదరులే నాకు శత్రువులయ్యిరి సమాధానము నొసగ సరగను రావా ||ఈ జీవిత||
చరణము 3
బయట పోరాటములు – భయపెట్టుచుండెను – బంధువులందరు బహుదూరులైరి – భార్యపుత్రాదులచే బాధలెన్నో గెలిగె బాధలన్నియు బాప బహుత్వరగా రావా ||ఈ జీవిత||
చరణము 4
రాజ్యంబుపై రాజ్యంబు రంకె వేయుచుండె – రాష్ట్రముపై రాష్ట్రంబు రగులుచుండె – రాజులకు రాజువై రయమున రావయ్య – రాజ్యమేలనూ ధరణిలో రమ్ము రమ్ము ||ఈ జీవిత||