#608

జాతీయ ఉత్సవములు – మాతృదేశ సేవ

రాగం: హిందూస్థాని · తాళం: ఆది · రచయిత: మార్తాండ జ్ఞాన ప్రకాశము

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
దేశ సేవ చేసి దేవ – దాసులై వర్ధిల్లుడి ఇలలో – మోసమార్గములను వీడి – యేసుని నిజదాసులగుడి – దోషములను వీడి దేవ – దాసులై వర్ధిల్లుడి ఇలలో || దేశ ||
చరణము 1
దేశ బంధువు యేసువే మన – దేశ రక్షకుడు ఆయనే దేశమంత యేసు మనసుతో – నాశతో సేవించుడి || దేశ ||
చరణము 2
నీతి న్యాయంబులు కలిగియు – నిష్ఠలందు మెలగియు నిత్య ప్రేమ చూపి యేసు – నిష్ఠ లేక మేలు లేదు || దేశ ||
చరణము 3
వినయ శక్తి నెంతగా వివరించి బోధించిన విశ్వ విభుండౌ యేసు వినయ – విధము లేక మేలు లేదు || దేశ ||
చరణము 4
ప్రేమ కలిగి పరమ సత్య – ప్రేమ సేవ చేయుడి ప్రేమమూర్తి యేసుక్రీస్తు – ప్రేమలలో వర్ధిల్లుడి ఇలలో || దేశ ||
చరణము 5
ఆసేతు హిమాచల ప – ర్యంతమును దిగంతము లేకముగాను దివిని భువిని – నేలు రాజు యేసుడే || దేశ ||