చరణము 1
స్నేహంపు బంధమా శుభంబు నొందుమా సత్ క్రైస్తవ సహవాసము స్వర్గంబును బోలును.ప్రభు పాదముల ప్రార్థించి కొలువుము భయ, నిరీక్షణాశలు ప్రార్థన లొక్కటే.ఒండొరుల బాధలన్ ఓదార్పు నొందుము ఒలికెడి కన్నీటితో నొప్పుమా స్నేహము.వియోగ కాలము విచారమైనను వీలు మరల కూడుట విజయ మైత్రితోడను.