#594

మట్టల ఆదివారము

రాగం: హిందూస్థాని తోడి · తాళం: ఆది · రచయిత: గేరా ప్రేమయ్య

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు ప్రభువు యెరూషలేము – ప్రవేశించిన విధము భాసురముగా తన మహిమ చూడగా – జేసెను ఆ దినము || యేసు ||
చరణము 1
భారవాహక గార్దభమెక్కి – బాహాటముగాను బయలుదేరెను జేజేలనగా – ప్రియముప్పగ తాను || యేసు ||
చరణము 2
గట్టిగా పాడుచు – గంతులు వేయుచు – అట్టహాసముతో కొట్టుచు కరతాళములను పెద్దగా – కూర్మి చూపిరిగా || యేసు ||
చరణము 3
పిల్లలు పెద్దలు మెల్లగా బోవుచు – ఉల్లాసముతోను చల్లని ప్రభువని జయములు గొట్టిరి – సంతోషముతోను || యేసు ||
చరణము 4
కొందరు మూర్ఖులు – తొందర చేయుచు – ముందుకు వచ్చిరిగా అందరు మానిన – అరుచును రాళ్ళని – అపుడా ప్రభువనగా || యేసు ||
చరణము 5
చిగురుటాకు చెట్ల కొమ్మలను – సొగసుగా మార్గములో బాగుగా పరిచిరి – భక్తిని చూపి – సాగుచు జనులంతా || యేసు ||
చరణము 6
యెరూషలేము – గతి గని ప్రభువు – ఏడ్చెను ఎలుగెత్తి మరియు యెరూషలేము దేవుని యాలయమును – పరిశుభ్రత చేసె || యేసు ||
చరణము 7
మనలోనున్న పాపము లెల్ల – మనుపును ఆ ప్రభువే ఘన కృపా శాంతులు – గలిగించియు మరి – ననయము బ్రోచు నిలను || యేసు ||