#578
కృతజ్ఞతార్పణలు
పల్లవి · Pallavi
నీ ధనము – నీ ఘనము – ప్రభు యేసుదే – నీ దశమ భాగము నీయ – వెనుదీతువా || నీ ధనము ||
చరణము 1
ధరణిలోన ధనధాన్యముల నీయగా – కరుణించి కాపాడి రక్షింపగా పరలోక నాథుండు నీకీయగా – మరి యేసు కొరకీయ వెనుదీతువా || నీ ధనము ||
చరణము 2
పాడిపంటలు ప్రభువు నీకీయగా – కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగా ప్రభు యేసు నామంబును – గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా || నీ ధనము ||
చరణము 3
వెలుగు నీడలు గాలి వర్షంబులు – కలిగింజె ప్రభు నీకు ఉచితముగా! వెలిగించ ధరణిపైని ప్రభు నామము – కరమిడికొలది ప్రభున కర్పంపవా || నీ ధనము ||
చరణము 4
కలిగించె సకలంబు సమృద్ధిగా – తొలగించె పలుబాధ భరితంబులు బలియాయె నీ పాపముల కేసువే – చెలువంగా ప్రభుకీయ చింతింతువా || నీ ధనము ||