#576
We Give Thee But Thine Own
చరణము 1
మేము ఇచ్చు కానుకల్ నీవే మాకిచ్చితివి – మా యాస్తియంత ప్రభువా నీ దానమే గదా.నీవుచితముగా – మా కిచ్చువాడవు అన్యులకుచితముగా – మేము ఇచ్చుచుందుము.సర్వత్ర బీదలు అన్నంబునొందరు – కన్నీళ్ళు రాల్చు ప్రజలు – అనేకులుందురు.ఈలాటివారికి – సహాయమిచ్చుట దాతలు చేయు సేవకు సమానమగును.పోషించి బీదలను – రక్షించి పాపులను అందరిని సంరక్షించుట – శ్రీ యేసు కార్యమే.నా బీదవారికి నీవిచ్చు దానము – నా కితువను వాక్యము – శ్రీ యేసు చెప్పెను.