#574
క్రైస్తవ దాతృత్వము
పల్లవి · Pallavi
ఇచ్చునట్టి విధము తెలియండి – ప్రియులారా మీరు – హెచ్చు పొందు విధము ఇది యండి – పుచ్చుకొనుట కన్న నెప్పడు – డిచ్చుటయే కడు ధన్యత యని – హెచ్చరించి చెప్పలేదా – యేసు ప్రభువపోస్తలులకు ||ఇచ్చు||
చరణము 1
శక్తికొలది దాన మీయుండి – సోదరులార – భక్తికొలది పరుల కీయుండి – శక్తి లేదని సాకు చెప్పక – సణుగ కేమియు సరగ శ్రద్ధా – శక్తితో పేదలకు నిచ్చుట – యుక్తమని భావించి మదిలో ||ఇచ్చు||
చరణము 2
నీతిబోధలు చేయువారికి – బోధకులైన – నిఖిల పాలకులైన వారికి – ఆతురముతో నీయవలెనని – యనుభవముగల మీరలల్లరు – చేతులార నీయుడయ్య – ప్రీతి తోడును వారవార ||ఇచ్చు||
చరణము 3
ఆలయ కృత్యములు జరిపించు – యాజకుండెప్పుడు – నాలయమువలన జీవించు – ప్రాలుమాలక పనిని చేయన్ – బరగు మీ యర్పణల కాన్కల – బలవంతము లేక మీరు పలువిధంబుల నియ్య వెదకండి ||ఇచ్చు||