#535

బాలల విన్నపము

రాగం: కురంజి (ఛాయ: పరమ తండ్రి నిన్ను) · తాళం: ఆది

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
బాలకుల విన్నపము లాలించు రక్షకా – పాలనంబు చేయుమా పరమ పోషకా ||బాలకుల||
చరణము 1
బాలలారా రండంచు – బిలిచిన యేసూ – చాలనమ్మి చేరితిమి – సరగ బ్రోవుమా ||బాలకుల||
చరణము 2
మందబుద్ధి చేత నిన్ను – మరచియుంటిమి – సుందరాంగ నీ దయ మా – యందు చూపుమా ||బాలకుల||
చరణము 3
చదువు వేదవాక్య సరణి – నడువ నేర్పుమీ – మదిని బోధకుల సుబోధ – మరువనీకుమీ ||బాలకుల||
చరణము 4
ప్రకటితమగు నీదు ప్రేమ – యనుభవించుచు – ఇకను నిన్ను సేవ జేతు – మఖిలకాలము ||బాలకుల||
చరణము 5
పుడమి నీదు సిలువ కృపను – పుణ్యులగుచును – కడను నీదు మహిమ జేర – కరుణ చూపుము ||బాలకుల||