#530

O Christians Leagued Together

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

చరణము 1
ఓ క్రీస్తు భక్తులారా – స్వార్థంబు గెలవవలె – నీతి నిమిత్తము పోరాడ కవచంబును ధరించుడి – శక్తుండు సైన్య ప్రభువు, శాంతిరాజుకు – అపార సేవచేయ అర్పణమైతివి. ||జోహారు, రక్షకుండ! నీ మార్గమందున విజయగృహ దైవ పురంబు బోదము||
చరణము 2
నడవండి ముందుకు నాదం చేయుడి – సాగిపోదము – హర్షంబు లేని యాత్మలెన్నెన్నో చూడుడు – ఈ ఘోర యుద్ధమున కంతరి గూర్చుడు.క్రీస్తే మా నాయకుండు – అటంచు దెల్పగా మా హృదయంబునందు – సంతోష శాంతి సేదలు కలుగునప్పుడు సిలువ ధ్వజము! ఈ లోక మేలులన్ని దీవెనలొందును.