#528

బాలల ప్రవర్తన

రాగం: యదుకులకాంభోజి (ఛాయ: సంతసంబగు క్రిస్మస్) · తాళం: ఆట · రచయిత: దాసరి మోజెస్

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
బాలకా నీ వర్తనము గా – పాడుకొని జీవింపరా మేలులకు బల కీడులకు నదె – మూలమని గమనింపరా ||బాలకా||
చరణము 1
తప్పి నడువకు మెన్నడేని – తల్లిదండ్రుల యాజ్ఞను – తప్పిపోయిన సుతుడు పడిన – తిప్పలు నీ వెరుగవా? ||బాలకా||
చరణము 2
గోలచేయుచు పెద్దలను గని – గేలిచేయుట తగదురా – బాలురు ఎలీషాను నవ్వి – ప్రాణగొడవ నొందిరే ||బాలకా||
చరణము 3
పరులకే గొనియారింప బోకుము – దొరలు నధికము మీ దనే – పరునికై హామాను నిల్పిన – ఉరినాతడే వ్రేలాడె ||బాలకా||
చరణము 4
కట్టడి కార్యంబు తుదకు – పట్టి కుడువక పోదురా – మిట్టిపడిన రాణి యెజెబెల్ – లెక్కలైన తెలియదా? ||బాలకా||
చరణము 5
వగవకుము పరధనము గని యది – తెగులు లేని బాధరా – సుగతి గనిన యాహాబు తా – శునకముల కాహారమై ||బాలకా||
చరణము 6
అనృతంబులాడకుము దే – హంతమైన నేమిరా? – అనృతము చేసిన యననియ – భార్యతో సహా కూలాడె ||బాలకా||
చరణము 7
కోపమున కాస్పదము నీయకు – గోరకుము మదినెన్నడూ – కోప జ్వాలలు పెంచి కయ్యును – గూడ చెందె హంతకుడై ||బాలకా||
చరణము 8
తులువల జత గూడి మాడి – చెవి నిచ్చుట తగదురా – పలువల సాంగత్యమున రెహబాము – భంగము నొందె ||బాలకా||
చరణము 9
బాలుడా నీ తరుణ హృదయము – ప్రభున కప్పగింపరా – శీల సౌష్ఠవ మొదవ నీకా – శిశువులను జేకూర్చరా ||బాలకా||