#396
మన రాజగు క్రీస్తు
పల్లవి · Pallavi
దేవ దాసపాలక రాజా రావే – జీవముల ప్రదాతవై ప్రకాశమొందగా – దేవా దేవా దీన పోషకా || దేవా ||
చరణము 1
లోకబాధ యిరుకు శోధన నుండి – స్వీకరించినావు ప్రత్యేకదేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్ర సమర్పణ || దేవా ||
చరణము 2
దిక్కులేని పాపి కొరకు నీ దేహం – మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా – జయం జయం జయము నొందగా || దేవా ||
చరణము 3
కఠినులంత కుటిలము చేసి నిన్ను – గట్టి కొట్టి నెట్టి నీకు గొయ్య నెత్తిరా – యిదే నా యెడ ప్రేమ జూపితి || దేవా ||
చరణము 4
ఇంత యోర్పు ఇంత శాంతమా నాకై – పంతముతో బాపి కొరకు ప్రాణ మియ్యగా – పాపిన నీదగు దాపు జేర్చవే || దేవా ||
చరణము 5
కలువరి గిరి వరంబున నాకై – తులువను నా కొరకు నిలను సిలువ మోయగా – హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ || దేవా ||