#393
నమ్మిక – నెమ్మది (క్రీస్తును ఆశ్రయించుట)
పల్లవి · Pallavi
నీ చరణములే నమ్మితి నమ్మితి – నీ పాదములే పట్టితి బట్టితి బట్టితి || నీ చరణములే ||
చరణము 1
దిక్కింక నీవే – చక్కగ రావే – మిక్కిలి మ్రొక్కెద మ్రొక్కెద మ్రొక్కెద || నీ చరణములే ||
చరణము 2
ఐహిక సుఖము – నరసితి నిత్యము – ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని || నీ చరణములే ||
చరణము 3
న్యాయము గాని – నా క్రియ లన్ని – రోయుచున్ ద్రోయకు త్రోయకు త్రోయకు || నీ చరణములే ||
చరణము 4
భావము మార్చి – నా వెత దీర్చి – దేవర ప్రోవవే ప్రోవве ప్రోవవే || నీ చరణములే ||
చరణము 5
చంచల బుద్ధి – వంచన యెద్ది – ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే || నీ చరణములే ||
చరణము 6
చుట్టుకొని యున్న – శోధనలున్న – పట్టు విడువగొట్టవే కొట్టవే కొట్టవే || నీ చరణములే ||
చరణము 7
నాచు పిశాచి – నరుకుట గాచి – కాచుకో దాచవే దాచве దాచве || నీ చరణములే ||
చరణము 8
యేసుని తోడ – నెవ్వరు సాటి – దోషము బాపును బాపును బాపును || నీ చరణములే ||