#290

తప్పిపోయిన వారిని మేలుకొలుపుట

రాగం: ఆనందభైరవి · తాళం: త్రిపుట · రచయిత: దావీదు చౌదరి

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఎందుకు మరిచితివి – యేసుని ప్రేమ – ఎందుకు మరిచితివి – ఎందుకు మరిచితివి – పొందితివి నిందలు – సుందరమగునట్టి – సుఖమైన ప్రభు ప్రేమ ॥నెందుకు॥
చరణము 1
దేవ గ్రంథము నీవు – చదవలేదా – భావమున దాని గైకొనలేదా – సేవక వృత్తులు – సేయక పోతివి – చావరాని చావు – సంపాదించితి వయ్యో ॥ఎందుకు॥
చరణము 2
చిందిన రక్తము – సిలువపైని – పొందెను కష్టము – మేకుల పోట్లు – నెందరెందరు కల్వరి – మెట్టుపై నతని – నిందించి చంపిరి – నిర్దయులై యకటా ॥ఎందుకు॥
చరణము 3
పాపేచ్ఛలోనుండి – మరలి వాని – శ్రీ పాదములు పట్టుము ప్రార్థించుము – కాపాడుటకు దయతో – కనిపెట్టి యున్నాడు – పాపి నీ విభుడైన – ప్రభు మార్గమున బొమ్ము ॥ఎందుకు॥