#270
సేవకుల కొరకైన దీవెన
పల్లవి · Pallavi
దీవెనల నిడు దేవా నీదు – సేవకై వెడలెడు దీనులపై – పావనాత్మ నంపుము – పనులలో నడిపించుము – కేవలంబుగా మా తనువులు నీ – సేవకై యర్పింపగ జేయుము ॥దీవెనల॥
చరణము 1
మాటిమాటికి బాపయుతంబౌ – మార్గమున జను మనసుల ద్రుంచి – మేటి క్రీస్తుని నామా – మృతము గ్రోలుచు మేమా – పాటున కాత్మల రక్షణకై – పనులు సల్పగ బంపుము కృపచే ॥దీవెనల॥
చరణము 2
దివ్య బోధలెదను గల్గి – దీనతను రక్షణ మార్గమును – భవ్యముగా బోధింప – పరమార్థ మెరుగించి – సేవ్య నేర్పావె దిన దినమును నీ – సేవకాళికి నీ మర్మముల ॥దీవెనల॥
చరణము 3
దురిత రోగాదులచే మిగుల – తూలి చను మనుజాళికి నీవే – పరమ విశ్రాంతి నిడు – వరదుడవంచు నడు – వెరవునను బోధింపగను నీ – వరములతో నింపుము దాసులను ॥దీవెనల॥
చరణము 4
గ్రామ సంఘంబులను బడుల – క్షేమముగా గాపాడి పెంప – ఓ మహాత్మ నీ కృప – తో మమ్ము గాచి సదా – స్వామి మాలో నీవును నీలో మేము – మనగను బ్రోవు మామేన్ ॥దీవెనల॥