#202
సిలువ ధ్యానము
పల్లవి · Pallavi
కదలమెదలక ఆశ్చర్యముతో, శ్రమలు.కరము పట్టి దరిని జేర్చి – వరములిడి దీవించిన యా కరుణగల చేతులలో చీల – గుచ్చెదరేల ||కల్వరి తీరు||
చరణము 1
ప్రేమ, కృప, నిర్మలత్వమును – నియమమును గల మోముపై యా పామరులుమి వేసెదరేల – పాటించరేల ||కల్వరి తీరు||
చరణము 2
ఘోర యాతనలను నీదు – క్రూర మరణము చూడ గుండె నీరునీరై పోవదే దేవా – క్రూరునికైన ||కల్వరి తీరు||
చరణము 3
పాపమేమి చేసి యెరుగవు – పావన పరమదేవుడవు ఓ పరాత్పర నీకేమి యింత – ఉత్కట బాధ ||కల్వరి తీరు||
చరణము 4
స్వామి మాకై పూటపడితివి నీ – ప్రేమయే कारणము నిజము భూమి యది గుర్తింపగ నిమ్ము – పూజ్యుడవు దేవా ||కల్వరి తీరు||
చరణము 5
పావనాత్మ నీవు జావ – పాపి కబ్బును నిత్య జీవ మా వచన సత్యంబు దెల్పుము – మానవాళికిన్ ||కల్వరి తీరు||
చరణము 6
సిలువ దరి కాపాడించుము – ఖలుడను ఘోరపాపిని కల్మషములు విడ శక్తినీయుము – సిలువ ధ్యానమున ||కల్వరి తీరు||