#122

క్రీస్తుని మహిమ

రాగం: మధ్యమావతి · తాళం: అట · రచయిత: తిరుకోవళ్లూరి స్టీవెన్

Category: సాయంతనారాధన · Open in the hymnal app

పల్లవి · Pallavi
లాలీ లాలీ లాలీ లాలమ్మ లాలీ – లాలీయని పాడరే బాలయేసునకు ||లాలీ||
చరణము 1
పరలోక దేవుని తనయుడో యమ్మ – పుడమిపై బాలుడుగా బుట్టెనో యమ్మ ||లాలీ||
చరణము 2
ఇహపరాదుల కర్త యీతడో యమ్మ – మహిపాలనము చేయు మహితాత్ముడో యమ్మ ||లాలీ||
చరణము 3
ఆద్యంతములు లేని దేవుడో యమ్మ – ఆదాము దోషమును గడుగ బుట్టెనమ్మ ||లాలీ||
చరణము 4
యూదులకు రాజుగా బుట్టెనో యమ్మ – యూదులతనితోడ వాదించి రమ్మ ||లాలీ||
చరణము 5
నర గొర్రెల మంద కాపరో యమ్మ – గొర్రెల ప్రాణంబు క్రీస్తు తానమ్మ ||లాలీ||