చరణము 1
మమున్ సృజించిన దేవుడు ప్రాణము నొసంగి యెప్పుడు కాపాడు మమ్మును సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుడాయనను.
చరణము 2
పలువిధములుగ బాధించు రోగముల్ పోగొట్టి మీదికు రాకుండ జేసెను సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుడాయనను.
చరణము 3
దేవుడు మాత్రమె రక్షణ మార్గము ఆయత్తపరిచి చూపించె మాకును సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుడాయనను.
చరణము 4
మా నిత్య బాధలు వారించుకొరకున్ దా సొంత పుత్రుని పంపెన్ సుప్రేమతో సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుడాయనను.
చరణము 5
ఆనందమొందుడి యేసు మోక్షము సుసేవకాళికి అనుగ్రహించును సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుడాయనను.