Articles in Telugu · Chapter 11 of 12
Articles in Telugu
Articles in Telugu







Text of the articles (machine-read from the facsimile pages)
ఈ పాఠము పేజీల చిత్రముల నుండి OCR ద్వారా తయారుచేయబడినది; అక్షర దోషములు ఉండవచ్చును. ఖచ్చితమైన పాఠమునకు పై పేజీ చిత్రములను చూడండి.
Souvenir page 87
దూర దేశం
ఆఛార్య తరార్కే దూరదేశం అంటే ఏమిటి? తప్పిపోయిన కుమారుణ్ని అడగండి. లూకా 15.13 wi కొన్ని దినములైన తరువాత ఆ చిన్నకుమారుడు సమస్తమును కూర్చుకుని, దూరదేశమునకు J స్రీ ప్రయాణమైపోయి, అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడుచేశాడు. తప్పిపోయిన కుమారులు ఇద్దరూ! పెద్దవాడు ఇంట్లో ఉండి తప్పిపోతే చిన్నవాడు దూరడేశానికి వెళ్లి తప్పిపోయాడు. కుమారుడు తప్పిపోయాడని వాడు చచ్చినట్లే భావించి తండ్రి ఏడుస్తున్నాడు. కనిపెట్టే తండ్రి ఈ ఉపమాన కథలో ముఖ్యవ్యక్తి ఎవరనుకున్నారు? కుమారుని కోసం కనిపెట్టే తండ్రి. ఈ కథలో ప్రతిఒక్కరూ తనను తానే చూచుకోవాలి. తప్పిపోయిన కుమారుడిలాగా నేను తప్పిపోలేదులే అనుకుని ard, దూరంగా ఉంచి చూడకండి. దగ్గరగా వచ్చి వాడి పోలికలు నీలో ఎన్నిఉన్నాయో సరిపోల్చి చూచుకొని అప్పుడు చెప్పండి. ఇంతకూ దూరదేశమెక్కడుంది? దేవుని నుండి ఒక్కఅడుగు దూరమైనా, అది దూరదేశమే! దేవుని చిత్తమును, సంకల్పాన్ని నమ్మకపోవటం, దేవుని తలంపులతో ఏకీభవించని వైఖరి - ఇవి దూరదేశానికి ప్రతీకలు. స్వార్దం దేవుని బిడ్డలలో స్వార్ధం ఏమాత్రం ఉన్నా వారు దూరదేశంలో అడుగుపెట్టారనే చెప్పాలి. ఎంత సేపటికీ నాకేం వస్తుంది? నాకేమి లాభం అని చూచే మనస్సు దూరదేశపు కాపురమే! పెద్ద కొడుకు సంగతేమిటి? వాడి నివాసం మారలేదుగాని వాడూ దూరదేశవాసే! తండ్రియందు నమ్మకంలేని కొడుకు. దూరదేశస్తుడే. సోదరుడా, సోదరీ, నీవు ఆత్మపరీక్ష చేసుకో. నీకు తెలీకుండానే నీవు దూరదేశంలో తిరుగుతున్నావేమో! చిన్న కుమారుడు ఏం చెప్పాడు? “తండ్రీ, ఆస్తిలో నాకు రావాల్సిన బాగం నాకిచ్చెయ్యి. నాతో నీకేం పనిలేదు. నాది నాకివ్వు - నా బతుకు నన్ను బతకనియ్యి.” 'ప్రియసోదరుడా, నీ వైఖరి ఎలావుంది?
నా ఇష్టం
నా ఇష్టప్రకారం నేను బతుకుతాను. నాకు ‘Ase కావాలి. నాకోరికలు, నా
ఉద్దేశాలు, నా అభిరుచులు, నా అభిప్రాయాలు, నాకుంటాయి. వాటిని చంపుకుని నీ దగ్గర బతకలేను! ఈ లోకంలో నన్ను హాయిగా బతకనియ్యి అని ప్రార్దన చేస్తున్నావా? నీ వాంఛలు నీ స్వంత ఏర్పాటు అలాగే నెరవేరాలని కోరుతున్నావా? నాకు ఫలాని పదవి కావాఇ. నా ఇష్టం నెరవేర్చు అని దేవుని మీదికి వత్తిడి తేవాలని చూస్తున్నావా? నీ ఇంటిలో, నీ సంఘంలో నీకు పదోన్నతి ముఖ్యం గదూ? నలుగురి పైన నీదే పెత్తనం అయిఉండాలనే యావ నిన్ను తినేస్తున్నదా? స్వార్దాపేక్ష నీలో ఎంతశాతం ఉంది. అధికారం కావాలిగాని బాధ్యతలుండ కూడదు అంటావా? తప్పిపోయిన కుమారుడూ నీవూ కవలపిల్లలా? నిజం చెప్పు - కవల పిల్లలు
నీకు పేరుప్రఖ్యాతులు కావాలని అడుగుతున్నావా? నలుగురిలో పేరుకోసం తాపత్రయ పడుతున్నావా? ఈ లక్షణాలన్నీ తప్పిపోయిన కుమారిడివే. నీకు డబ్బు కావాలా? డబ్బుతో కొనగలిగినవన్నీ కొనాలని ఆశ. సంవత్సర సంపాదనంతా ఇప్పుడే ముందుగా చెల్లించి వస్తువాహనాలు కొనే మనస్తత్వం అంతా తప్పిపోయిన కుమారునిడే. నీ వృత్తివ్వాపారాలలో నిరంకుశ ధోరణి, దేవుడికి చెప్పకుండా స్వతంత్రించి తీర్వానాలు చెయ్యటం తప్పిపోయిన కుమారుడి ధోరణే, మతం
మతపరంగా కూడా తప్పిపోయిన కుమారుడివేనా? క్షమించు అని అడుగుతావు గాని నీవు ఇతరులను క్షమించవు. దేవుని కృపను కోల్పోయిన వాడివి అవుతావు. దేవుడు నిన్ను వాడుకోటానికి బదులు నీవే దేవుణ్ని వాడుకుంటున్నావా?
త SP తా త త.
Souvenir page 88
qn "ఇ
% thy W “ie శ (1 ీతయితే నీవు అచ్చం తప్పిపోయిన కుమారుడి కవలసోదరుడివి. దేవుని పనికోసం ఆకలి దప్పులున్నాయా, లేక డబ్బుకోసలీ
ఆకలిదప్పులతో ఆరాటపడుతున్నావా? దేవుని కోసం సాహసించ లేవు గాని కాపుదలకావాలని అడుగుతావు కదూ? ఇతరులు నరకంలో పడుకుండా కృషిచేయకపోతే నీవు దుర్వయపుత్రుడివే. దేవుని కుటుంబంలో స్వార్ధపరుడివై పరాయత్తస్వజీవివి కాకూడదు. అయితే నీవు దూరదేశ పౌరుడివయ్యావని అర్దం. దూరదేశంలో జీవితం ఎంత ఘోరమో గమనించండి. మన తలాంతులు, మన సామర్ద్యం దూరదేశంలో వృధాఅయిపోతాయి. స్వార్ధం మనల్పు పశుప్రాయులను చేస్తుంది. దేవునికి అపకీర్తి తెస్తుంది. స్వార్ధకేంద్రితమైన బతుకు దేవునికి అపసవ్యం. దేవుని చిత్తానికి విరుద్దం. దేవుని మహిమను వెదికేబతుకు నిత్యత్వంలో సత్ఫలితాలనిస్తుంది. స్వలాభపరాయణులు దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా జీవించలేరు. వీరు తప్పిపోయిన కుమారుడిలాంటివారే. స్వార్ధం వల్ల ఆధ్యాత్మిక క్షామం దాపురిస్తుంది, క్షేమం అంతరిస్తుంది. ఇహలోక ప్రయోజనాలు తాత్కాలికంగా వారికి కలుగుతాయి గాని అంతరంగంలో వారికి కరువు కాటకం ప్రాప్తిస్తుంది. స్వార్చం మనిషిని ఆధ్యాత్మిక దారిద్ర్యంలోనికి పడనెడతుంది. స్వంత కోర్కెలను తీర్చుకునేందుకు ఎంత నీచానికైనా దిగుజారుతారు. ధనధాన్యాదులు విపరీతంగా సేకరించుకుని వాటికి బానిసలై చివరికి కుమిలికునారిల్లి పొతారు. SHOWA, గురించి దేవునికి లెక్క అప్పగించాలని, తాము గృహనిర్వాహకులమని వారు (గ్రహించరు. పశ్చాత్తాపం
తప్పిపోయిన కుమారుడు పశ్చాతప్తుడయ్యాడు. బుద్దిహీనుడికి బుద్దివచ్చింది. అంత వరకు అతనిలో కృతజ్ఞతా భావం బొత్తిగాలేదు. ఆధ్యాత్మిక పరిపక్వత అతనిలో స్తంభించింది. అతని ధోరణి స్వవినాశాత్మకమైంది, గాని అతడిప్పుడు SAY. బుద్దిరావటంతో అతడు ఆధ్యాత్మిక స్పృహ గలవాడై తెప్పరిల్లాడు. అతనికి కనువిప్పు కలిగింది. దూర దేశంలో ఒక్కక్షణంకూడా ఉండలేక పొయ్యాడు. ఆకలికి అవమానానికి తట్టుకోలేక పొయ్యాడు. తన మార్గం మార్చుకున్నాడు, తాను నడిచిన బాట ఎంత ప్రమాదమో, తాను తన తండ్రికి ఎంత దూరమయ్యాడో తెలియగానే కార్యోన్ముఖుడయ్యాడు. తననుతానే అసహ్యించు కున్నాడు. తన ప్రస్తుత స్థితికి తానే బాధ్యుడు అని (గ్రహించాడు. తండ్రిమీద నింద వెయ్యలేదు. తన అన్నను దూషించ లేదు, తన స్థితికి తానే సిగ్గు చెందాడు. తన మనస్సాక్షికి యధార్దంగా ప్రవర్తించాడు. తన నేరాన్ని సమర్టించుకోలేదు, ఒప్పుకున్నాడు. తన చుట్టూరా ఉన్న సమాజాన్ని దూషించలేదు. తన స్థితికిమరెవరూ కాదు తానేనైతిక బాధ్యత వహించవలసి ఉంది అని గ్రహించావు. తండ్రి దగ్గరికి తిరిగి వెళ్లిపోతాను అని తెలివైన తీర్మానం చేసుకున్నాడు. లేచాడు. తండ్రి ఇంటికి బయలు దేరాడు. కృతనిశ్చయుడైనాడు. ఇంతవరకూ అతడు పరభాగ్యోపజీవి, పరానృభుకు. ఇప్పుడు పరోపకార బుద్ది వచ్చింది. తాను తండ్రిని ఇవ్వు అని అడిగాడు గాని ఇప్పుడు నా తండ్రి దగ్గర కూలిపనైనా చేస్తాను. నా తండ్రిది తినెయ్యటం కాదు. కష్టించి పనిచేసి నా తండ్రి చేతికి నా కానుక ఇస్తాను అని తీర్మానించు కున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు. కొత్త మలుపు
అతని జీవితం కొత్త మలుపు తిరిగింది. అతని మనసు మారింది, వైఖరి మారింది, స్థితి మారింది! అతడిప్పుడు కొత్త మనిషిగా మారాడు. పరివర్తన చెందాడు. తండ్రి ఇంతకాలమూ తన కుమారుడి రాకకోసమే కనిపెట్టి ఎదురుతెన్నులు చూస్తున్నాడు. కొడుకు వస్తే అతడికోసం గొప్ప విందుచేయాలని సిద్ధపడుతున్నాడు. తండ్రి కుమారుడికి ఎదురు వచ్చాడు. తండ్రి కుమారుణ్ని కౌగిలించుకుని ముద్దెట్టుకున్నాడు. కుమారుడు గుండె పగిలేటట్టు ఏడ్చాడు. “నీకు విరోధంగా దేవునికి విరోధంగా పాపం చేశాను” అని ఒప్పుకున్నాడు. నీ కుమారుణ్ని అనిపించుకోటానికి యోగ్యుణ్ని కాను అని చెప్పుకున్నాడు. కనికరంతో వాత్సల్యంతో తండ్రి కుమారుణ్ని చేర్చుకున్నాడు. క్షమించాడు. అలాగే ప్రియ సోదరుడా నీవు తండి వద్దకు BAT! దూరదేశంనుండి తండ్రికి దగ్గిరిగా వచ్చేయ్యి. ఈ క్షణమే దేవునికి Gow. “తండ్రీ - నీలాగే నేనూ ఇచ్చేవాణ్బి అవుతాను. పరపీడన మానేసి పరోపకారినవుతాను. ఇతరులను గాయపరచటం మాని, వారి గాయాలు మాన్పి సేవచేస్తాను. ఇతరులను ప్రోత్సహిస్తాను. నిరుత్సాహ పరచను.” ప్రియస్పేహితుడా - రా, తండ్రి నీకు స్వాగతం పలుకుతాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు నిన్ను రమ్మని ఆహ్వానిస్తున్నారు. నీకంటే ముందుగా దేవుని బిడ్డలైన నీ అన్నలు నిన్ను రమ్మంటున్నారు. రా, కదిలిరా! దైవాశీస్సులు.
Souvenir page 89
క్రీస్తులో se జీవితం
డా!! దేవసహాయం దండల.
పుట్టుక లేదా జన్మను యేసయ్య ఓ ఉదాహరణగా చెబుతూ, ఆత్మ రాజ్యంలో
దైవికంగా పుట్టే అనుభవాన్ని ఆయన వర్ణిస్తున్నాడు. పుట్టుకకు ముందు శిశువును
బాహ్య (ప్రపంచంతో ఎటువంటి సంబంధమూ, అవగాహనా వుండదు. అదే విధంగా
దేవుని ఆత్మ మూలంగా పుట్టని ప్రతి వ్యక్తికీ దేవునితో ఎటువంటి సబంధంగానీ, దేవుని గురించిన అవగాహన గానీ వుండదు. పరలోకపు సంగతులతోనూ, నిత్యత్వంతోను అతనికి సంబంధం వుండదు.
ప్రారంభ జీవితం !
యేసయ్యను నీ జీవితంలోకి స్వీకరించినప్పుడు నీ జీవితాన్ని సరికొత్త కోణంలో జీవించడం |ప్రారంభిస్తావు. నీవు యేసయ్యను కనుగొన్నప్పుడు జీవితం నిన్ను కనుగొంటుంది. 2 కొరింధి 5:17-20 ఎవరైనా క్రైస్తవుడైనప్పుడు అతని అంతరంగంలో సరికొత్త వ్యక్తి అవుతాడు. రక్షణ అనేది మనం చేసే పనికాదు. నీవు యేసయ్యను స్వీకరించినప్పుడు ఆయన చేసేది. ఏ రకంగానూ నిన్ను నీవు రక్షించుకోలేవు. మునిగి పోతున్న వ్యక్తి తనను తాను ఎలా రక్షించుకోగలడు? ఎవరో ఒకరు అతనికి సహాయం చెయ్యాలి. రక్షించేవాని మీద అతడు పూర్తి నమ్మకం వుంచినప్పుడు అతడు రక్షించబడతాడు. యేసు నీ కోసం చేసిన పని ఇదే! పాపంలో కూరుకుపోయి, సైతాను అధికారం క్రింద వున్న దేవుని తీర్పుకు పాత్రయై నరకానికి వెళ్తున్న జీవితం నుండి నిన్ను విడిపించాడు. దేవుని రాజ్యపు స్థిరమైన నేలమీద నీ పాపాలను ఆయన నిలబెట్టాడు. పాత మార్గాలనుండి బయటికి తీసుకు వచ్చి, శాశ్వత జీవం నీకు అనుగ్రహించాడు. కొలస్సి 1:18-14” అంధకార రాజ్యంలోనుండి తన ప్రియకుమారుని రాజ్యంలోకి రప్పించాడు.”
మనుష్యులు కేవలం మానవ జీవితాన్ని మాత్రమే పునరుత్పత్తి చేస్తారు. కాని పరిశుద్ధాత్మ పరలోకం నుండి కొత్త జీవితం అనుగ్రహిస్తాడు. మనలో ప్రతి ఒక్కరిలోనూ నిద్రాణంగా వున్న మరో కనుదృష్టి వుంటుంది. అది దేవుని ఆత్మ చేత మేల్కొలుపబడాలని ఎదురు చూస్తూ వుంటుంది. ఇది దేవుని సంగతులను అర్ధం చేసుకోగల సామర్థ్యం.
ఆత్మ సంబంధమైన చెవుల ద్వారా దేవుని మాటలు వినగల సామర్థ్యం నీకుంది. నీతో మాట్లాడి, సంబంధం కలిగి వుండాలని దేవుడెప్పుడూ ఆశపడుతున్నాడు. ఆయన మాటలు వినగలిగేలా ఆత్మతో ఆయన నిన్ను బ్రతికించాడు. ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి !
జీవించే (ప్రతీదీ అభివృద్ధి చెందడమనేది ప్రకృతి సిద్దమైనది. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ సత్యమే కనిపిస్తుంది. నిజమైన క్రైస్తవుడు తెలివియందు, జ్ఞానమందు, విశ్వాసమందు జీవిస్తాడు. విశ్వాసి తన విశ్వాస జీవితంలో చలన రహితంగా వుంటూ తన ప్రభువుతో నూతన అనుభవములు పొందని యెడల ఆధ్యాత్మికంగా దిగజారే ప్రమాదముంది. తాను ఎదుర్కొనే శోధనలు జయించలేక పోతాడు. దేవుడు వాడుకోలేని వ్యక్తిగా తయారవుతాడు. ఆత్మీయ జీవితంలో ఎదిగి అభివృద్ధి చెందేవాడు జీవిత రంగంలో తాను ఎదుర్కొనే ప్రతి
RY
i) vey, ig)
> eS SYS
‘SS
Souvenir page 90
RS
ae
qa "ఇ
OP Wl alt" ye
DHMH ఎదురు నిలిచి జయించగలడు. ప్రభువు Sot ఆనందాన్ని అమితంగా అనుభవించగలడు. పరిశుద్ధమైన జీవితం జీవించి, దేవునికి యోగ్యమైన సేవచేసి ప్రభువును మహిమ పర్చగలడు.
విశ్వాసంలో ఎదుగుదల !
5 a గ్
క్రైస్తవుడు తన విశ్వాస జీవితంలో ఎదిగి, అభివృద్ధి చెందాల్సిన అవసరత వుంది. నూతన విశ్వాసులు క్రీస్తునందు పసివారు అని పిలువబడినప్పటికిని, వారు ఎప్పుడూ ఆ విధంగా ఆత్మ సంబంధమైన పసిపిల్లలు గానే వుండిపోరు. వారు ఎదుగుతారు. పరిశుద్దునికి వుండవలసిన గురిని గూర్చి పౌలు HOR) 3:12-14లో “క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నత పిలుపుకు కలుగుబహుమానాలు” అని పిలుస్తున్నాడు. ఇది మన ముందు ఉంచబడిన క్రైస్తవ విశ్వాసపు పందెపురంగము యొక్క గురి. (హెబ్రి 12-12).
నూతన జీవన శైలి !
నీ నూతన జీవన శైలిలో నడిపింపు కోసం అనుదినం దేవుని వైపు చూస్తున్నప్పుడు ఈ సంగతులు సంభవిస్తాయి. నీవు వాక్యాన్ని చదువుతూ వుండగా దేవుడు తాను వాక్యం ద్వారా మాట్లాడటాన్ని నీవు గ్రహిస్తావు. కొన్ని సార్లు మనుషులు నిన్ను విడిచిపోవచ్చు. అయితే క్రుంగిపోవద్దు. దేవుడెప్పుడూ ఒకేవిధంగా వున్నాడు. ఆయన సౌశీల్యం పూర్తిగా నమ్మదగినది.
రెండు దారుల నడుమ ఎటు అడుగు వేయాలో తీర్మానించుకోవల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఉన్నత మార్గాన్ని, శ్రేష్టమైన, పవిత్రమైన అధిక ఫలవంతమైన, నమ్మకమైన మార్గాన్ని ఎంచుకో!
దేవుని గురించి సందేహమేదైనా కలిగితే, బహుశా ఆ దారి నీకు మంచిది కాకపోవచ్చు. ప్రతిదినం బైబిలు ధ్యానం !
బైబిల్ ఎంతో మనోహరమైన (గ్రంధం. ఈ (గ్రంధంలో ముఖ్యమైన ప్రతి అంశాన్ని గురించి దేవుని ఆలోచన నీకు కనిపిస్తుంది. నీవు దేవుని వాక్యం చదువుతుండగా మార్పు పొందమని నీకు సవాలు గలగడాన్ని గుర్తిస్తావు. దేవుని వాక్కుల ద్వారా మనం దేవుని జీవంలో పాలు పంచుకుంటాం. సైతాను శోధనల్ను ఎదుర్కొని, పీడించే శక్తిని, అధికారాన్ని పొందుతాం. ఎఫెసి 6:7. ప్రతి రోజూ నీవు దేవుని వాక్యం చదివేలా మనసు కుమర్చుకోవాలి.
దేవుని పనిలో సహకరించు !
నీ జీవితాన్ని ఈ నూతన సంవత్సరంలో వర్ధిల్ల జేయాలనీ, నీ అవసరాలన్నీ తీర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రభువు నీ జీవితంలో చేసిన మేలులు, ఉపకారాలు మరువకుండా కృషితో కానుకలు, దశమభాగాలు నీ ఆత్మ సంబంధమైన మందిరానికి తీసుకొని వెళ్ళి, ఆరాధనలో ఇతర విశ్వాసులందరితో కలిసి దానిని ప్రభువుకు అర్పించు. దేవుడు గడిచిన సంవత్సరమంతా నీకు చేసిన మేళ్ళకు ఆయనకు ప్రేమ, కృతజ్ఞతలు చెల్లించుకునే సమయమిది. దేవునికి స్తోత్రం!
Souvenir page 91
Serie" | టే ఫ్ర a క్షమాపణ
(గ్రేస్ విజయ గంట
PO 4:32 “నేను నిన్ను క్షమించ గలనుగానీ నీవు చేసిన అపకారాన్ని మర్చిపోలేను” ఇదే చాలా మంది చేస్తున్నపని.
క్షమ అనేది RS నిబంధనను రెండుగా చింపి వేయడం. అది పూర్తిగ కనబడకుండా కాల్చి వేయడం. నిజమైన క్షమాపణ : ad వ్యక్తి తన ఆఫీసు పని పూర్తయిన వెంటనే యిల్లు చేరకుండా చాలాసమయం క్లబ్బులో తప్పత్రాగి, స్పేహితుల సహాయంతో యిల్లు చేరతాడు. అది వారి పెండ్లిరోజు భార్య గొడవ చేయక, ఆప్యాయంగా భర్తను ఆదరించి పరిచర్య చేసింది. స్పేహితులున్నారని మాత్రమే కాస్తంత మర్యాద పాటించింది. తెల్లవారిన తర్వాత భర్త గతంలో తన ప్రవర్తనకై సిగ్గుపడి, భార్యను క్షమాపణ కోరాడు. “ఇక ఎన్నడూ నిన్ను బాధ పెట్టను. ” అని ప్రమాణం చేసాడు.
ఒక నెల గడిచింది. భార్య ప్రతి సందర్భంలో మన పెండ్లి వార్షికోత్సవం నాడు ఆనందంగా గడపనీయక త్రాగి నిరాశ పెట్టావు. నేను కాబట్టి నిన్ను క్షమించి ఊరుకున్నాను.” ఇలా కించపరుస్తూ ఉండేది. ఎన్నోసార్లు యిదే పద్దతిలో విసిగిస్తుంటే, భర్త విసికిపోయి అడిగాడు. “నీవు నన్ను క్షమించావు, మర్చిపోయావని తలంచాను. కానీ యిలా హింసిస్తున్నా వెందుకు?” wary.
నేను క్షమించి మర్చిపోయానని నీవు మాత్రం మర్చిపోకూడదు సుమా” అందుకే గుర్తు చేస్తున్నాను” అందట.
క్షమించడమంటే అదికాదు. మానసిక గాయం పూర్తిగా మాని పోవాలి. ఆ బాధకరమైన భావాల ఛాయలు ఉండరాదు. గాయాలు స్వస్థపడాలి. పడమటికి తూర్పెంత దూరమో పాపములకు మనకు అంత ఎడము కలుగజేసిన దేవుడు మనకు క్షమాగుణాన్ని దయచేస్తాడు. “dm చేస్తున్నారో వీరికి తెలియదు క్షమించ” మన్న ప్రభమ PAY స్తెఫను వాక్కులు ధ్యానం చేయాలి.
క్రీస్తు మాటలు అనుసరించిన స్తెఫనును అనుకరించడం నేర్చు కోవాలి. బాధింపబడి నప్పుడు కూడా పరుషవాక్కులు నోటికి రాకుండా జాగ్రత్తపడాలి. ఆశాభావంతో మంచిగా మాట్లాడేవారికి శరీరములో నరాలు సడలి రక్తప్రవాహం సాఫీగా మెదడుకు ప్రవహించి ఉత్సాహ వంతులుగా ఉంటారట. మెదడు సవ్యంగా పనిచేయడంవల్ల మంచి నిర్ణయాలు తీసికోగల్లుతారు. మంచి జవాబు నివ్వగలరు. ఆరోగ్యకరమైన భావాలతో విశ్రాంతిగా వున్నవారు మంచినిద్ర కలిగి సుఖజీవనం సాగిస్తారు. క్షమించక కక్ష పగ మనస్సులో ఉంచుకుంటే చిరాకు పెంచుకొంటే, అసందర్భ (ప్రేలాపనలు నోటికి వస్తాయి. వదరు బోతుల్లా హానికరమైన మాటలతో యితరుల హృదయా లను గాయపరుస్తూ, స్నేహితులను సుకువుగా కోల్పోతారు. అనారోగ్య సూచనగా తలనొప్పి, కళ్ళు తిరగడం, రక్త పోటు అధికం కావడం, చివరికి పక్షవాత లక్షణాలు సమీపిస్తాయి. సాధ్యమైనంత వరకు క్షమాగుణాన్ని పెంచుకోవ డానికి ప్రయత్నించాలి.
సామెతలు 16:24. ఇంపైనమాట తేనె పట్టు వంటింది. మధురమైనది, ఎముకలకు ఆరోగ్యము. సామెతలు 6:2 నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి యున్నావు. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన సమాధి తోట ఉండాలి. అందులో ప్రేమించేవారు, స్పేహితులు చేసే Sor), బాధించే మాటల్ని పాతిపెట్టేసెయ్యాలి.
ఆ క్రీస్తు, ప్రార్థనతోనే ఆరంభించిన ఏడు మాటలు ప్రార్థనతో ముగించాడు. సిలువలో సూచక క్రియలు చేయలేక పోవచ్చు. క్షమించ మని ప్రార్థన చేసి. మనలను ప్రార్ధించమని నేర్పుతున్నారు.
సంసోను ఆఖరిఘడియలలో శక్తికూడ గట్టుకొని తన శత్రువులను ఎక్కువ మందిని చంపేసాడు. మన ప్రభువైన క్రీస్తు శత్రువులను క్షమించారు. ఆయన్ను పట్టుకోడానికి సైనికులు వచ్చినపుడు పేతురు కత్తిదూసి ప్రధాన యాజకుని చెవి తెగ నరికాడు. అప్పుడు ప్రభువు నీ కత్తి ఒరలో పెట్టుమని చెప్పి ఆ దాసుని చెవిని తిరిగిఅతికించాడు.
క్రీస్తు కరుణలోతుల్ని ఎవరు కొలువ గలరు? యేసు బోధించిందే చేసి చూపించాడు. మత్తయి 5:44 శత్రువులను ప్రేమించండి. హింసించువారికొరకు ప్రార్థించండి.
క్రీస్తు అనుచరుడైన పౌలుకూడా చేసింది అదే. 1కొరింధి4:12నిందింపబడియు దీవించు చున్నాము. హింసింపబడియు ఓర్చుకొను చున్నాము. అనుదిన జీవితంలో ఉపయోగకర మైన సూక్ష్మరహస్యం ఈ మాటలో దాగిఉంది.
క్షమించడం ఎలా? మనపట్ల ద్రోహం చేసినవారు తమ తప్పిదాలను తెలిసికోలేక పోతే వాళ్ళ కోసం ప్రార్థించాలి.
1 యోహాను 1:9 మన పాపములను ఒప్పుకొనిన యెడల క్షమిస్తారు.
లూకా 7:48 పాపాత్మురాలు అత్తరు పూసినప్పుడు పాపాలు క్షమిస్తానన్నారు క్రీస్తు.
మార్కు 2:5 పాపంగాచేయబడిన క్రీస్తు సిలువలో ప్రార్థించాడు.
మత్తయి 9:6 భూమిమీద క్షమించే అధికారమున్న క్రీస్తు ప్రార్థించిన రీతిగా మన జీవితాల్లో ప్రతి అనుభవానికి ప్రార్ధనయే జవాబు. GSES క్షమ ఉంది. నెమ్మది ఉంది.
ఎంతపాపినైనను యేసు చేర్చుకొనును అంటూ క్షమావార్తను క్రీస్తుసువార్తను అంతటా చాటించండి ! హల్లెలూయా, హల్లెలూయా.
Souvenir page 92
ui ఈయన ఎవరో? ఎట్టివాడో? — ™
భవానీ ప్రభాకర్ రాయ
కొన్ని సంవత్సరాల క్రిందటి మాట. అవి నేను ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న దినాలు. ఒక దినము మా స్ట్రాప్ రూములో ఒక విషయము చర్చనీయాంశముగా మా పాఠశాలకు అప్పటి వరకున్న ప్రధానోపాధ్యాయురాలు పదవీరమణ చేయబోతుంది. నూతనంగా ప్రధానోపాధ్యాయురాలిగా యింకొక అనుభవశాలి, విద్యావేత్త రాబోతుందని వినికిడి. అదే ఆ దినపు చర్చనీయాంశము. “అబ్బో ఆవిడ చాలక్రమ శిక్షణ పరురాలని మా పొరుగింటామె చెప్పింది. లెక్కల టీచరంది. ఎందుకంటే ఆమె పాఠశాలకు సమయానికి రావాలంటే ఎంత యిబ్బంది.” మా చిన్నాయన కూతురికి రాబోయే ఆమె తెలుసు మనము దిద్దిన పేపర్లు భూతద్దంలో చూచినట్లు తిరిగి చూస్తుందని” మా కజిన్ చెప్పిందని అక్కడ ఉన్న ఇంగ్లీషు టీచరంది. ఆమెకు మనసుపెట్టి పేపర్లు దిద్దాలంటే మహాబద్దకం ఇదంతే మూల నుండి గమనిస్తూ తనమానాన్న తను పనిచేసుకొంటున్న సైన్సు టీచరు “ఆ పండిక మీ వ్యాఖ్యానాలు. మన స్కూలులో ఆవిడ కాలుపెట్టనేలేదు అప్పుడే ఆవిడ ఎవరో, ఎలాటిదో అని మీ ఊహాగాలకు అంతులేదు. వచ్చాక ఆవిడ ఎలాటిదో చూద్దురుగాని. ఇప్పుడప్పుడే ఒక నిర్ణయానికి రావద్దని” మందలించింది సైన్సు టీచరు. అందరిలో పెద్దది, ఆవిడ మాటను గౌరవించి యింకెవరము నోరెత్త లేదు. మేము ఎవరి గురించి యింత చర్చించుకొన్నామో! ఆవిడ వచ్చారు. పదవీ స్వీకారము చేసారు. కొన్ని దినాలలో మంచి కార్య దక్షత కల్లిన స్త్రీ అని పేరు తెచ్చుకొన్నారు. మా అంచనాలన్నీ తారుమారు చేసి అందరి మన్ననలు పొందారు. ఇట్టే తుది నిర్ణయానికి రావడము మన బలహీనత సత్యాన్ని గ్రహించక ముందే ఒక నిర్ణయానికి తొందరపడి వచ్చేస్తాము.
పరిశుద్ధ (గ్రంధమైన బైబిలు చదివినప్పుడు ఎన్నో సత్యాలు మనము గ్రహించవచ్చును. కొన్ని సార్లు ఏకాగ్రతతో వాక్యము చదవము. ఏకాగ్రత లేనప్పుడు అందులోని లోతైన విషయాలు అర్థము కావు, గ్రహించము కూడ. సువార్తలు చదువుతున్నప్పుడు ప్రభువు కాలములోని వారికి వచ్చిన తలంపులే. మనకు కూడ రావచ్చును. యేసుక్రీస్తు పరిచర్యలోనున్న మూడున్నర సంవత్సరాలు ఆయనను గురించి వివిధ వ్యక్తులు వెలిబుచ్చిన అభిప్రాయాలను దేవుని వాక్యము నుండి పరిశీలిద్దాము. మార్కు 4:41 మత్తయి 8:27, లూకా 8:25 యీ మూడు లేఖన భాగాలలో ఆయనకు అతి సన్నిహితులైన శిష్యులే
తన కండ్లముందు జరిగిన అద్భుతాన్ని చూచి “ఈయన ఎవరో! గాలియు, సముద్రమును యీయనకు లోబడుచున్నవని యొకనితో యొకడు చెప్పుకొనిరి” “ఈయన ఎవరు?” అన్న ప్రశ్న ప్రభువు పరిచర్యలో ప్రతిధ్వనించిన ముఖ్యాంశము. లూకా 5:21లో పక్షవాయువు గలవాని స్నేహితులు అతనిని మంచముతో ఇంటిపై కప్పుతీసి దింపిన సమయములో క్రీస్తు వానిని స్వస్థపరుస్తాడు. అక్కడే ఉన్న శాస్త్రులు పరిసయ్యులును - “దేవదూషణ చేయుచున్న యితడెవ్వడు? దేవుడొక్క తప్ప మరియ ఎవడు పాపములు క్షమింపగలడని” ఆలోచించుకొనసాగిరి. మనము లూకా 7:49 క్షుణంగా పరిశీలిస్తే తన కన్నీళ్ళతో ఆయన పాదములు కడిగిన స్త్రీని ప్రభువు క్షమించినప్పుడు “పాపములు క్షమించుచున్న యితడెవ్వడని” ఆయన భోజన పంక్తిలోనివారు ఆలోచించుకొన్నారు. లూకా 9:9 చదివినప్పుడు క్రీస్తు చేయుచు కార్యములను గూర్చి విన్న హేరోదు రాజు “ఎవని గూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవ్వడో అని చెప్పి” ఆయనను చూడగోరాడు. మత్తయి 21:106* “ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు - ఈయన ఎవరు అని కలవరపడెను. ప్రభువు చుట్టూ ఉన్నవారిని కలవరపెట్టిన మూడు సంఘటనలను వాక్యాధారముగ పరిశీలిద్దాము.
తుఫానును అణచిన odds ఎట్టివాడో?
(మత్తయి 8:18, 23:27, మార్చు 4:35-41, లూకా 8:22-25)
పై చెప్పిన సువార్తలోని వాక్యాలను, మనము పరిశీలించినప్పుడు తుఫాను సంఘటనను చూస్తాము. మన ప్రభువు గలిలయ సముద్రపు తూర్పు తీరానికి వెళ్ళినట్లు మార్కు తన సునవార్తలో పేర్కొన్నాడు. ఈ సంఘటనకు ముందు ఉపమానాల ద్వారా ప్రజలకు ప్రభువు బోధించినట్లు చూస్తాము” వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోనెలో తీసికొనిపోయిరి” అంటే సిద్ధపాటులేకుండ, భోజన పదార్థాలు సిద్ధపరచుకోకుండా, చూచుకోకుండా వెళ్ళిపోయారన్నమాట మానవ మాత్రునిగా ఉన్న యేసుకు కొంత విశ్రాంతి అవసరము అంతి వరకు అలసిసొలసిన ప్రభువు సముద్రము మీద వచ్చే చల్లగాలికి త్వరలోనే నిదురపోయారు. (లూకా 8:23) కపెర్బహోము నుండి గెరాసీనుల దేశానికి అడ్డంగా వెళ్ళిపోతే కొద్ది మైళ్ళే. వాతావరణం అనుకూలంగా ఉంటే రెండు మూడు గంటలు. గలిలయ సముద్రములో యిటువంటి తుఫాను అనుభవాలు అక్కడున్చవారికి తరచూఎదురవుతుంటాయి. “దోనె నీళ్ళతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో యుండిరి” లూకా 8:25. ఆ నావలో ఉన్న వారిలో కొద్దిమంది చేపలు పట్టేవారే. వారు అది ఎట్టువంటి తుఫానో (గ్రహించి భయపడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రభువు నిద్రిస్తునేయున్నారు. శిష్యులు కలవరపడ్డారు. ఆపద ముంచుకొస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు నిస్సహాయతతో
Souvenir page 93
ai be So —a Wee" 7 ( (1 ేసిన ఆర్తనాదమే శిష్యులు చేసారు. యేసునుండి వారు ఏమి పొంద తలచారో మనకు తెలియ నీటిని ద్రాక్షారసంగా మార్చడమే
వారు చూచారు కాని సముద్రాన్ని గద్దించడము వారెదగరు. ఆపదలలో ఉన్న బిడ్డలు తండ్రి దగ్గరకు సహాయాన్ని అర్థించడానికి వెళ్ళినట్లయింది వారిస్థితి. గనుక ఆయన యొద్దకు వచ్చి, “ప్రభువా, ప్రభువా నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయనలేచి గాలిని నీటిపొంగును గద్దింపగానే అవి అణగినిమ్మళమాయెను.” లూకా 8:24 గాలి, గాలితోపాటు తరంగాలు కూడ ఒక్కసారే ఆగిపోయాయి. ఈ వింతైన అనుభవానికి అందరూ అమితంగా ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో “ఈయన ఎవరో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి”. మన ప్రతి ఒక్కరి జీవితాలలో యిట్టి అనుభవాలు ఎప్పుడో ఒకప్పుడు ఎదురౌతుంటాయి. ఆ కాలపు శిష్యులు వేసిన (ప్రశ్న మనము కూడ వేస్తాం “మా పరిస్థితి యింత అల్లకల్లోంగ ఉంటే నీకు చింతలేదా అని కేకలు పెడాము. ప్రతి క్రైస్తవ విశ్వాసి హృదయ కల్లోలాన్ని ఆపగల శక్తి మన ప్రభువు ఒక్కరికే ఉంది.
దేహములను, ఆత్మలను బాగుచేయు ఈయన ఎట్టివాడో?
(మత్తయి 8:28-34, మార్కు 5:21, లూకా 8:26-40
యేసు ఆయన శిష్యులు చివరకు గమ్యానికి చేరుకొన్నారు. మత్తయి మార్కు లూకా యీ సంఘటనను పేర్కొన్నారు. గలిలయ తూర్పు తీరాన యీ గ్రామముంది. అలసిపోయిన ప్రభువు యీ ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవాలనుకొన్చాడు. ప్రభువు ఆశించిన యీ చిన్న కోరిక ఆవిరియైపోయింది. దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాడు. అవి కొండ దిగువనున్న పందుల గుంపులోకి వెళ్ళడానికి సెలవిమ్మని కోరాయి దయ్యములు ఆ గుంపులోనికి ప్రవేశించినప్పుడు అవి వేగముగా కొండ దిగువనున్న సము(ద్రములోనికి వెళ్ళి మునిగి చచ్చాయి. ఈ విషయాన్ని విన్న జనులు ప్రభువును ఆ (ప్రాంతాన్ని విడిచి పొమ్మని కోరారు. (వారి వ్యాపారం దెబ్బ తింటుందని భయపడి వుండవచ్చు) దయ్యములు పట్టి స్వస్థత నొందిన యిద్దరిలో ఒకడు ప్రభువుతో ఉండాలని కోరాడు. అయితే (ప్రభువు వానితో “నీవు నీ యింటివారి యొద్దకు వెళ్ళి (ప్రభువు నీయందు కనికపరబడి నీకు చేసిన కార్యములన్నింటిని వారికి తెలియచెప్పవలెను” (మార్కు 5:19) స్వస్థత పొందిన వ్యక్తి వెంటనే విధేయత చూపాడు. దీనిని బట్టి ప్రభువు తిరిగి ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు గొప్ప ఆహ్వానము లభించింది. ఈ సంఘటన మన ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకొనే సంఘటన. “పేమించబడని (ప్రేమకు నోచుకోని వారి ఆత్మలను దేహాలను బాగుచేసే ఈయన ఎవరో అని ఎంతోమంది తలచి తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. దానికి జవాబు కనికరముగల కరుణామూర్తి యేసుప్రభువఉరి మనకు ఎట్టి వారమైన క్రీస్తు మనలను (ప్రేమించునన్న సత్యమే.
పాపులతో భోజనము చేయు ఈయన ఎవరో
మత్తయి 9:1,10-17, మార్చు 2: 15-20-89,
ఈ సంఘటనలన్ని జరిగిన తరువాత ప్రభువు SHOR Sv BBA వచ్చారు. ఇది తెలిసికొన్న ప్రజలు తమన అవసరతలకొరకై ప్రభువును సమీపించారు. ఆ సమయంలోనే యేసు యాయీరు కుమార్తెను లేపారు. (మత్తయి 9:1, మార్కు 5:22-24, లూకా 8:41-44) లేవి (మత్తయి) ప్రభువు గౌరవార్టము తన యింట గొప్ప విందు చేసి ఎంతో మందిని ఆహ్వానించారు. సుంకరులు పాపులు అనేకులు యేసు సహపంక్తిని ఉన్నారు. అది చూచి పరిసయ్యులు సణగనారంభించారు. (లూకా 5:30). “పాపులతో భోజనము చేసే యితడెట్టివాడో” అన్న అనుమానము వారికి వచ్చియుండవచ్చును. ప్రతి ఒక్కరి హృదయ తలంపులు ఎరిగిన ప్రభువు యీ విధముగా జవాబిచ్చారు. “మారుమనస్సు పొందుటకై పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని” చెప్పాడు. లూకా 5:32. ఇంకొక చోట తాను “నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని” చెప్పెను. (లూకా 14:16)
“ఎంత పాపినైనను
యేసు చేర్చుకొనును
అంచు నీ సువార్తను
అంతట చాటించుడి”
పై కీర్తన (పాట) మనందరికి సుపరిచితమైనదే. తన చుట్టూ ఉన్నవారికి ప్రభువైన యేసు మూడు విధాలుగా ఆశ్చర్యపరచినట్టు చూచాం.
తుఫానులు అణచిన యీయన ఎట్టివాడో? శక్తిగల మహనీయుడు
దేహములను ఆత్మలను బాగుచేయు ఈయన ఎవరు? కనికరముగల కరుణామూర్తి
పాపులతో భోజనము చేయు ఈయన ఎవరో? - పాపులకై ప్రాణము పెట్టిన (ప్రేమామయుడు
అన్యులకు రక్షణలేని వారికి నీవు సువార్త పంచుకొన్నప్పుడు (ప్రభువు ఎవరని వారు నిన్ను ప్రశ్నిస్తే “ఆయన మనలను (ప్రేమించి తన్నుతాను మన కొరకై మరణించిన మాన్యు ఉన్న సత్యాన్ని వెల్లడి చేయు ఆ భావన వారి హృదయాలను మార్చగలదు.
Souvenir page 94
Do not merely listen to the word, and so deceive yourselves. Do what it says. - James 1:22 (NIV)
Trinity Telugu Christian
: sociation USA, Ine. ( TIGA న
WE MEET AT 5:30 PM, VERY | OR 2% SATURDAY OF THE MONTH Venue Calvary Chapel, 25 Van Zant St, East Norwalk, CT . 06855
L Special Video Screening Studs Bible
_ ££ Praise & Worship both in Telugu and "=" English
LE శ Testimony & Prayers Bible Readings NY Ky Bible One-O-One కాట... Fi inspirational message లి
Followed by fellowship meal
TTCA Projects in India & USA
+ Thanks Giving Meals to Widows * Support for building Churches
and rural Villages in rural areas in India * Orphan kids support * Support to Bible colleges « Gospel meetings in Villages + Indian Missionaries support + Reaching Indians in USA for * Spreading Gospel among Jesus Christ Indians in USA
About TTCA: TTCA was established by inspiration of God The Father, Jesus Christ Our Savior and Holy Spirit Our comforter to reach Telugu Christians across the United States and India to share the Love of Jesus Christ both in Spiritual and social. As Apostle Paul said in Colossians 3:14: ...And above all these things put on charity, which is the bond of perfectness. CT Bible study started as part of our mission. Please check our web site for more details and our programs. Join us to be part of this great mission and share the Love of Lord Jesus Christ.
phone: 203-570-9666 Email: [email protected] Web:http: //www.ttcausainc.com
Souvenir page 95
Christ-Centered Family Friendly Channel
Now on three IPTV platforms availalhe in US, UK and Asia Broadcasting the Gospel to the nations in Telugu, Hindi and English
with a set top box you can watch on your regular Television
Interested Churches & Ministries may contact us for airtime information
For more details Please visit www.velugutv.com info @velugutv.com
Velugu Television Network P.0.Box 1 Lallaguda
Secunderahad-17 AP. India Tel: 040-27226688
www. velugutv.com
Souvenir page 96
Software Development & Consulting
Optimizing Business processes by Leveraging IBM FileNET
We are a strategic solutions partner to leading software vendors, IBM, Microsoft.
As a IBM FileNet Value Net partner, JW is working with financial services clients to implement applications that streamline business processes and take advantage of the new components of the P8 platform including Business Process Management,
JW has developed industry-specitic solutions to help with some of the most critical enterprise content management services.
Business Process Outsourcing (BPO) is the delegation of one or more IT-intensive business processes to an external provider that in turn owns, administers and manages the selected process based on defined and measurable
performance criteria. Improvement in cost, quality and productivity has encouraged customers to rapidly scale up
~~" STW Technologies Inc.
398 Spotswood Englishtown Rd Monroe NJ 08831 Phone : 732-231-6731
e-mail: [email protected] web site: www.JWTechInc.com
Religious & Social Welfare
Help in
Planting churches in villages
The missionaries to spread the Gospel
Medical assistance and care for expecting mothers and new born babies
The promotion of awareness about the compliance with immunization program
The promotion of awareness regarding HIV/AIDS
The education of children and adults in rural areas
The provision of opportunities to the woman and other underprivileged persons
Please support through your sacrificial donation.