UECF

Worship- United Evangelical Christian Fellowship Church(UECF), New Jersey

← Back to Home

ప్రభువానీకార్యములు (Ab)

పల్లవి:ప్రభువానీకార్యములుఆశ్చర్యకరమైనవి

దేవానీదుక్రియలుఅద్బుతములైయున్నవి(2X)

నేపాడెదన్నేచాటెదన్నీదు నామంభువిలో

సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X)

1.హాలేలూయ హాలేలూయ

భరియింపరానిదు:ఖములుయిహమందు నను చుట్టిన

నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి(2X)
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి

నీదు సాక్షిగా యిలలో జీవింతును

సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X)

2.హాలేలూయ హాలేలూయ

లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో

నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి (2X)
నిర్దోషిగ చేయుటకై నీవు ధోషివైనావు

నీదు సాక్షిగా యిలలో జీవింతును

సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X)

ప్రభువానీకార్యములుఆశ్చర్యకరమైనవి

దేవానీదుక్రియలుఅద్బుతములైయున్నవి(2X)

నేపాడెదన్నేచాటెదన్నీదు నామంభువిలో

సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా(2X)

పరిశుద్దాత్మ  దేవా దిగి రమ్మయ్య

పల్లవి:పరిశుద్దాత్మ  దేవా దిగి రమ్మయ్యమాపై దిగి రమ్మయ్య     (2)నింపుమయా - మము నింపుమయానీ  శక్తితో మము నింపుమయా

1.ఆదరణ కర్త దిగి రమ్మయ్య  - మా పై దిగి రమ్మయ్యా    సమాధాన అధిపతి దిగి రమ్మయా- మాపై దిగి రమ్మయానింపుమయా - మము నింపుమయా

నీ శక్తితో మము నింపుమయా

2.స్వస్థ పరచూ దేవా దిగి రమ్మయ్య - మాపై దిగి రమ్మయ్యాబలపరచు దేవా దిగి రమ్మయ్యా - మా పై దిగి రమ్మయ్యనింపుమయా - మము నింపుమయానీ శక్తితో మము నింపుమయా    3.శాంతి నొసగు తండ్రి దిగి రమ్మయ్యా - మాపై దిగి రమ్మయ్యనడిపించే తండ్రి దిగి రమ్మయ్యా - మాపై దిగి రమ్మయ్యానింపుమయా - మము నింపుమయానీ శక్తితో మము నింపుమయా  

లెక్కించ లేనయ్యా  నీ మేలులను

పల్లవి:లెక్కించ లేనయ్యా  నీ మేలులను

వేనోళ్ళ కొనియాడెద నీ మహిమను

లెక్కించ లేనయ్యా నీ మేలులను

వేనోళ్ళ కొనియాడెద నీ మహిమను

హల్లెలుయా ... హల్లెలుయా

హల్లెలుయా ఆమెన్ హల్లెలుయా ...

1.ఎన్నిక లేని నాలోఉన్నా ... ప్రతి లోపమునూ చూచి (2)

ఎనలేని నీ ప్రేమను చూపి ... నన్ను రక్షించి నావు (2) 

హల్లెలుయా ... హల్లెలుయా (2)

హల్లెలుయా ఆమెన్ హల్లెలుయా    

లెక్కించ లేనయ్యా నీ మేలులను  

వేనోళ్ళ  కొనియాడెద నీ మహిమను....

2.గాడంధకారపు లోయలలో ... నేను సంచరించినను (2)

నీ గాఢ ప్రేమను చూపి ... నాన్నదరించి నావు (2)

హల్లెలుయా ... హల్లెలుయా (2)

హల్లెలుయా ఆమెన్ హల్లెలుయా    

లెక్కించ లేనయ్యా నీ మేలులను  

వేనోళ్ళ  కొనియాడెద నీ మహిమను...  

3.నా కాళ్ళను లేడికాళ్ళగ చేసి ... నన్ను బలపరచినావు (2)

నీ ఆత్మను నాకు యిచ్చ్చి ... నన్ను స్థిరపరచినావు (2)

హల్లెలుయా ... హల్లెలుయా (2)

హల్లెలుయా ఆమెన్ హల్లెలుయా

లెక్కించ లేనయ్యా నీ మేలులను  

వేనోళ్ళ  కొనియాడెద నీ మహిమను...

లెక్కించ లేనయ్యా నీ మేలులను  

వేనోళ్ళ  కొనియాడెద నీ మహిమను..

హల్లెలుయా ... హల్లెలుయా

హల్లెలుయా ఆమెన్ హల్లెలుయా ...

యాత్రీకులం మనమందరం

పల్లవి:యాత్రీకులం మనమందరం ...  ఈ జీవ యాత్రలో సాగెదం

కలదో మార్గము జీవమునకు ... కనుగొంటివా మరణించ వెన్నడూ  

నీలో నాలో ఉన్నది ఓ మార్గం ... ఆ మార్గమే కలువరి మార్గమూ  

తొట్రిల్లనీ యాత్రీకులమై ...

సియోను  పురమును చేరేదము ...(2)

1.ఒక నది కలదు ... ఆ బాట చెంతనే .... ప్రవహించు చూనే  జీవించును

జల స్వరము చే ఆ నది పిలచునూ ... యాత్రికుని దాహము తీర్చునూ

నీలో నాలో ఉన్నది ఓ మార్గం ... ఆ మార్గమే కలువరి మార్గమూ

తొట్రిల్లనీ యాత్రీకులమై ...

సియోను  పురమును చేరేదము ...(2)

2.పలుమారులు ఆ బాట ను క్రమ్మునూ ... ఓ చల్లనీ చీకటి నీడ

వెరవకు ఓ నిజమున్నదీ ... నీడెచ్చటో  వెలుగ చ్చటే   ఉన్నదీ

నీలో నాలో ఉన్నది ఓ మార్గం ... ఆ మార్గమే కలువరి మార్గమూ

తొట్రిల్లనీ యాత్రీకులమై ...

సియోను  పురమును చేరేదము ...(3)